iDreamPost
android-app
ios-app

RCBకి దారుణంగా దెబ్బేసిన మ్యాక్స్‌వెల్‌! మ్యాచ్‌ ఆడంది ఫామ్‌లో లేకకాదు!

  • Published Apr 19, 2024 | 3:20 PM Updated Updated Apr 19, 2024 | 3:20 PM

Glenn Maxwell, T20 World Cup 2024; ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. ఆర్సీబీలో స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. తాజాగా మ్యాక్స్‌వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Glenn Maxwell, T20 World Cup 2024; ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. ఆర్సీబీలో స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. తాజాగా మ్యాక్స్‌వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 19, 2024 | 3:20 PMUpdated Apr 19, 2024 | 3:20 PM
RCBకి దారుణంగా దెబ్బేసిన మ్యాక్స్‌వెల్‌! మ్యాచ్‌ ఆడంది ఫామ్‌లో లేకకాదు!

ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చెత్త ఆటతో విమర్శలు మూటగట్టుకుంటుంది. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌ 2024 తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ.. తర్వాత పంజాబ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒక విజయం, ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్‌ చేరుతుందనే నమ్మకం కూడా పెద్దగా ఎవరికీ లేదు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చాలా మార్పులతో బరిలోకి దిగింది.

స్టార్‌ ఆటగాళ్లు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ లాంటి స్టార్లను పక్కనపెట్టి మరీ బరిలోకి దిగినా.. ఆర్సీబీ జాతకంలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్‌ను సమర్పించుకుంది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో తనను పక్కన పెట్టాలని కోరి మరీ మ్యాక్స్‌వెల్‌ బెంచ్‌కి పరిమితం అయ్యాడని వార్తలు వచ్చాయి. ఫామ్‌లో లేడు కాబట్టి టీమ్‌ కోసం ఆలోచించి, తన ప్లేస్‌ను త్యాగం చేశాడని క్రికెట్‌ అభిమానులు, ఆర్సీబీ ఫ్యాన్స్‌ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. మ్యాక్స్‌వెల్‌ గైర్హాజరీ వెనుక అసలు కారణం వేరే ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గురించి ఆలోచించి, బ్యాడ్‌ ఫామ్‌ను సాకుగా చూసిస్తూ.. మ్యాక్స్‌వెల్‌ బెంచ్‌కి పరిమితమై.. రెస్ట్‌ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అంటే కావాలనే ఆర్సీబీ టీమ్‌కు బాగా ఆడకుండా, అదే సాకుగా చూపి రెస్ట్‌కి రెస్ట్‌, డబ్బుకి డబ్బు తీసుకుంటూ ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్‌కప్‌లో బాగా ఆడాలని ప్రిపేర్‌ అవుతున్నాడు మ్యాక్సీ. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు మ్యాక్స్‌వెల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీమ్‌ని గెలిపిస్తాడని నమ్మితే ఈ విధంగా మోసం చేస్తావా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.