iDreamPost
android-app
ios-app

Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్​వెల్​ షాకింగ్ డిసిషన్‌.. అస్సలు ఊహించని ఫ్యాన్స్!

  • Published Jan 19, 2024 | 5:15 PM Updated Updated Jan 19, 2024 | 5:15 PM

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. మ్యాక్సీ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. మ్యాక్సీ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

  • Published Jan 19, 2024 | 5:15 PMUpdated Jan 19, 2024 | 5:15 PM
Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్​వెల్​ షాకింగ్ డిసిషన్‌.. అస్సలు ఊహించని ఫ్యాన్స్!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు క్వాలిటీ స్పిన్ బౌలింగ్ టాలెంట్​తో కంగారూలకు ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో విజయాలు అందించాడు మ్యాక్సీ. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లోనూ అతడు ఆడిన తీరును అంత ఈజీగా మర్చిపోలేరు. ఆప్ఘానిస్థాన్​తో కీలక మ్యాచ్​లో సెమీస్​ చేరాలంటే గెలవక తప్పని సిచ్యువేషన్​లో అతడు చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టాప్, మిడిలార్డర్ అంతా పెవిలియన్​కు చేరిన వేళ ఒక్కడే నిలబడి ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి ఆసీస్​ను గెలిపించాడు. క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని షాక్​కు గురిచేసిన ఇన్నింగ్స్ అది. వరల్డ్ కప్ తర్వాత భారత్​తో టీ20 సిరీస్​లో ఆడిన మ్యాక్సీ.. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లో ఆడుతున్నాడు. అయితే ఈ స్టార్ ప్లేయర్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు.

బిగ్​బాష్ లీగ్​లో మెల్​బోర్న్ స్టార్స్ టీమ్​కు ఆడుతున్న మ్యాక్స్​వెల్.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బీబీఎల్ 2023-24 సీజన్​లో మెల్​బోర్న్ దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. చెత్తాటతో గ్రూప్ స్టేజ్​ నుంచే వైదొలిగింది. దీంతో సారథిగా ఉన్న మ్యాక్సీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్​బై చెప్పాడు. దీంతో మెల్​బోర్న్ స్టార్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. గెలుపోటములు సహజమని.. ఇలాంటి డిసిషన్ తీసుకోవడం సరికాదని అంటున్నారు. తాము వెంట ఉంటామని, సపోర్ట్ చేస్తామని కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని చెబుతున్నారు. మ్యాక్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై ఆసీస్ స్టార్ రియాక్ట్ అయ్యాడు. నెక్స్ట్ స్టేజ్​కు వెళ్లాలంటే ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడటం తనకు నచ్చదన్నాడు మ్యాక్స్​వెల్. కొన్నాళ్లు లీగ్​లో డామినేషన్ తర్వాత మళ్లీ అలా పెర్ఫార్మ్ చేయలేకపోవడం బాధగా ఉందన్నాడు.

గత నాలుగేళ్లుగా జట్టు ప్రదర్శన విషయంలో అసంతృప్తిగా ఉన్నానని మ్యాక్స్​వెల్ తెలిపాడు. అందరూ బాగానే ఆడుతున్నా తమకు లక్ కలసి రాలేదన్నాడు. సరైన సమయంలో గాయంతో కీలక ప్లేయర్లు తప్పుకోవడం టీమ్​ను దెబ్బతీసిందన్నాడు. ఇక, ఈ సీజన్​లో మెల్​బోర్న్ స్టార్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు మ్యాక్సీ. 34.71 యావరేజ్​తో 243 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్​లో 7 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్​ ఫామ్​ను ఇక్కడ కంటిన్యూ చేయడంలో అతడు ఫెయిలయ్యాడు. వరుస ఓటములు, బ్యాటర్​గా తన మీద ఉన్న ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకోకపోవడం, లీగ్ దశను దాటలేకపోయాననే బాధతోనే అతడు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పినట్లు అర్థం అవుతోంది. ఇక, బీబీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కప్ గెలుచుకోని జట్లలో మెల్​బోర్న్ స్టార్స్ ఒకటిగా ఉంది. ఆ టీమ్ మూడు సార్లు రన్నరప్​గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్​కు చేరుకున్నా కప్పును కైవసం చేసుకోలేకపోయింది. మరి.. బీబీఎల్​లో మెల్​బోర్న్​ జట్టు సారథ్యానికి మ్యాక్స్​వెల్ గుడ్​బై చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.