iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ స్ట్రైక్ రేట్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అందరికి ఇచ్చి పడేశాడుగా!

  • Published Apr 28, 2024 | 5:56 PM Updated Updated Apr 28, 2024 | 5:56 PM

విరాట్ స్ట్రైక్ రేట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. బహుశా గంభీర్ ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించకపోవచ్చు. ఇంతకీ ఏమన్నాడంటే?

విరాట్ స్ట్రైక్ రేట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. బహుశా గంభీర్ ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించకపోవచ్చు. ఇంతకీ ఏమన్నాడంటే?

Virat Kohli: కోహ్లీ స్ట్రైక్ రేట్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అందరికి ఇచ్చి పడేశాడుగా!

టీమిండియా రన్ మెషిన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. జట్టులో ఇతర ఆటగాళ్లు అంతా విఫలమైన చోట.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరదపారిస్తున్నాడు. అయితే టీమ్ కు మాత్రం విజయాలు దక్కడం లేదు. దీంతో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు మెుత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి. ఇక కోహ్లీ స్లో బ్యాటింగ్ వల్లే ఆర్సీబీకి విజయాలు దక్కడం లేదంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ స్ట్రైక్ రేట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. బహుశా గంభీర్ ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించకపోవచ్చు.

విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్.. ఈ స్టార్ ప్లేయర్ల మధ్య గొడవలు ఎప్పుడూ గొడవలే జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ మీడియా అత్యుత్సాహం వల్ల తప్పుడు సమాచారం ప్రచారం జరిగిందని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా యంగ్ ప్లేయర్ల కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో విరాట్ బ్యాటింగ్ చేస్తుండటాన్ని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే వారందరికి ఇచ్చిపడేశాడు గౌతమ్ గంభీర్.

విరాట్ స్ట్రైక్ రేట్ గురించి గంభీర్ మాట్లాడుతూ..”టీమ్ లో ఉన్న 11 మంది ప్లేయర్లు ఒకే తీరు ఆటను కలిగి ఉండరు. ప్రతి ఒక్కరికి ఓ భిన్నమైన ఆట ఉంటుంది. మాక్స్ వెల్ ఆడినట్లు కోహ్లీ ఆడకపోవచ్చు.. కోహ్లీ కొట్టిన షాట్లు మాక్సీ బాదకపోవచ్చు. అయితే టీమ్ గెలిచినప్పుడు స్ట్రైక్ రేట్ 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. అదే ఒకవేళ ఓడిపోతే.. 190 ఉన్నా మన కంటికి కనిపించదు. గ్రౌండ్ ను బట్టి, పిచ్ ను బట్టి.. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్స్ తమ స్ట్రైక్ రేట్ ను రొటేట్ చేస్తుంటారు. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. అంత మాత్రాన విరాట్ లాంటి దిగ్గజ ప్లేయర్ ను నిందించడం సమంజసం కాదు” అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సీజన్ లో కోహ్లీ 9 మ్యాచ్ ల్లో 430 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. మరి ఎప్పుడూ కోహ్లీని నిందిస్తాడని పేరున్న గంభీర్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.