తొలి టెస్ట్​కు ముందు బంగ్లాదేశ్​కు గంభీర్ వార్నింగ్.. గట్టిగానే ఇచ్చిపడేశాడు!

Gautam Gambhir Warning To Bangladesh: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన.

Gautam Gambhir Warning To Bangladesh: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన.

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో బంగ్లాను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సూపర్ స్ట్రాంగ్​గా ఉండటంతో అపోజిషన్ టీమ్​ను ఓ ఆటాడుకోవాలని చూస్తోంది. చెపాక్ పిచ్​పై బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించాలని భావిస్తోంది. అయితే పాకిస్థాన్​ను క్లీన్​స్వీప్ చేశామన్న ఓవర్​ కాన్ఫిడెన్స్​తో ఈ మధ్య బంగ్లా కాస్త అతిగా ప్రవర్తించింది. సిరీస్​కు ముందే మన టీమ్​కు వార్నింగ్ ఇచ్చింది. దీనికి తాజాగా భారత కోచ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. తొలి టెస్ట్ మొదలవడానికి ముందే ఆ జట్టుకు హెచ్చరికలు పంపించాడు. అసలు గౌతీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

చెపాక్​లో తమ స్పిన్నర్లు చెలరేగడం ఖాయమని గంభీర్ అన్నాడు. టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్​ త్రయంతో జాగ్రత్తగా ఉండాలంటూ బంగ్లాదేశ్​ను హెచ్చరించాడు గౌతీ. తమ స్పిన్నర్లు మామూలోళ్లు కాదని.. వాళ్లతో పెట్టుకుంటే చిత్తవడం ఖాయమని స్పష్టం చేశాడు. చెన్నైలో ఈసారి మ్యాచ్ జరిగేది ఎర్ర మట్టి పిచ్​ మీదే అయినప్పటికీ.. తమ దగ్గర క్వాలిటీ స్పిన్ అటాక్ ఉందన్నాడు భారత హెడ్ కోచ్. తమ స్పిన్నర్లు చెపాక్​ పిచ్​పై మ్యాజిక్ చేస్తారని.. వాళ్లతో బీ కేర్​ఫుల్ అంటూ ప్రత్యర్థి జట్టుకు గట్టిగా ఇచ్చిపడేశాడు. కాగా, పాక్​తో సిరీస్​లో గెలిచాక బంగ్లా కెప్టెన్ షంటో ఓవరాక్షన్ చేశాడు. తమ స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని.. ఇదే రీతిలో ఆడితే భారత్​ను కూడా చిత్తు చేయడం పక్కా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

టీమిండియాను ఓడించేందుకే వస్తున్నామంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో కామెంట్ చేయడంతో అప్పట్లో దుమారం రేగింది. భారత్​ను భారత్​లో అందునా టెస్టుల్లో ఓడించడం అంటే మాటలా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్సే.. ఇండియా టూర్ అంటే వణికిపోతాయి. ఇక్కడ టెస్టుల్లో గెలవడం మాట పక్కనబెడితే.. మ్యాచ్​ను కనీసం నాలుగో రోజుకు తీసుకెళ్లినా గొప్పగా భావిస్తారు. క్వాలిటీ స్పిన్ అటాక్, అద్భుతమైన పేస్ అటాక్ ఉన్న మెన్ ఇన్ బ్లూతో మ్యాచ్ అంటే భయపడతారు. కానీ బంగ్లాదేశ్ ఇవన్నీ మర్చిపోయి ఓడిస్తామంటూ ఓవరాక్షన్​ చేసింది. అందుకే తాజాగా గంభీర్ ఆ టీమ్​కు ఇచ్చిపడేశాడు. తమ స్పిన్ అటాక్​ను తక్కువ అంచనా వేస్తే మట్టికరవడం ఖాయమని హెచ్చరించాడు. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments