SNP
Gautam Gambhir, Suryakumar Yadav: టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ సంచలన నిర్ణయంతో.. సూర్యకుమార్ యాదవ్‌కు న్యాయం చేయాలని చూస్తున్నాడు. మరి ఆ నిర్ణయం ఏంటి? చేయాలనుకుంటున్న న్యాయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, Suryakumar Yadav: టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ సంచలన నిర్ణయంతో.. సూర్యకుమార్ యాదవ్‌కు న్యాయం చేయాలని చూస్తున్నాడు. మరి ఆ నిర్ణయం ఏంటి? చేయాలనుకుంటున్న న్యాయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా టీ20 క్రికెట్‌లో ఇకపై గౌతమ్ గంభీర్ హవా నడవనుంది. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. హెడ్ కోచ్‌గా వస్తున్న గంభీర్ టీమ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకోనున్నాడు. ఇకపై అతనే బాస్‌గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియాలో ఉన్న వారంతా యువ క్రికెటర్లు కావడం, బీసీసీఐని శాసించే అంత స్టార్‌డమ్ లేకపోవడంతో హెడ్ కోచ్‌గా ఉండే గంభీరే ఇకపై జట్టుపై పూర్తి పట్టు కలిగి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తనకొచ్చిన ఈ పవర్‌తో ఓ ప్లేయర్‌కు మాత్రం గంభీర్ న్యాయం చేయాలని చూస్తున్నాడంటా.. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు గంభీర్ అతని విషయంలో న్యాయం చేయాలని చూస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
గౌతమ్ గంభీర్‌కు టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశం రాకపోయినా.. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు మాత్రం చాలా కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలోనే కేకేఆర్ రెండు కప్పులు కూడా గెలిచింది. 2012, 2014 సీజన్స్‌లో గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2024లోనూ కోల్‌కత్తా నైట్ రైడర్స్ కప్పు గెలిచింది. ఈ సారి గంభీర్ కెప్టెన్ కాకపోయినా మెంటర్‌గా ఉన్నాడు. అయితే.. తాను కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ జట్టులో ఓ అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. కానీ, గంభీర్ ఏనాడు ఆ ప్లేయర్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. అలా ఆ ప్లేయర్‌కు అన్యాయం చేశాడు. గంభీర్ అన్యాయం చేసిన ఆ ప్లేయర్ ఎవరో కాదు.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఈ విషయాన్ని గంభీర్ కూడా స్వయంగా వెల్లడించాడు. తన 7 ఏళ్ల కెప్టెన్సీలో కాలంలో పెద్ద రిగ్రేట్ ఏంటంటే.. సూర్యకు అతని సత్తాకు తగ్గ అవకాశం ఇవ్వలేదు అని తెలిపాడు.
ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన తర్వాతే సూర్యకుమార్ యాదవ్‌కు ఫేమ్ వచ్చింది. కానీ, అతనికున్న టాలెంట్‌కు సూర్యకు ఎప్పుడో నేమ్ ఫేమ్ రావాల్సింది. కానీ, కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్.. సూర్యకుమార్‌లోని సత్తా గుర్తించడంలో ఆలస్యం అవ్వడంతోనే సూర్య చీకటిలో ఉండిపోయాడు. ఆ విధంగా సూర్యకు ఒకింత అన్యాయం చేసిన గంభీర్.. తాను చేసిన తప్పుకు ఇప్పుడు హెడ్ కోచ్‌గా సరిదిద్దుకోవాలని చూస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్ చేసి.. న్యాయం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 కెప్టెన్ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించాలని గంభీర్.. బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారనే వార్తలు వచ్చినా.. గంభీర్‌తో పాటు రోహిత్ శర్మ కూడా పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడానికి సముఖంగా లేరని సమాచారం. మరి సూర్యకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని గంభీర్ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One month ago,Gautam Gambhir said his biggest regret in his 7 years of Captaincy was that he never used Suryakumar yadav to his potential.
He returned as Team India head Coach and looks like he wants to correct himself by awarding him with T20 Captaincy.pic.twitter.com/7yfwY8oIuA
— Sujeet Suman (@sujeetsuman1991) July 16, 2024