Somesekhar
శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్ కు తన మార్క్ టీమ్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్ కు తన మార్క్ టీమ్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియాలో సమూల మార్పులు వచ్చిన, వస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత జట్టులో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్ కు తన మార్క్ టీమ్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు గంభీర్. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియా త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈనెల 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆగస్ట్ 2 నుంచి 7 మధ్యలో వన్డేలు ఆడనుంది. ఈ రెండు రోజుల్లో టీ20, వన్డేలకు జట్లను ప్రకటించనుంది బీసీసీఐ. ఇక టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కెప్టెన్ గా సూర్య కుమార్ కు పగ్గాలు అందించాలని మేనేజ్ మెంట్ భావిస్తోందట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చర్చంతా వైస్ కెప్టెన్ ఎవరనే? గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ పగ్గాలు అందిస్తారని అందరూ భావించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పంత్ ను పక్కనబెట్టి సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు ఆ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో గంభీర్ తన మార్క్ ను ఇప్పటి నుంచే చూపుతున్నాడని క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. దాంతో అతడికి జట్టులో చోటు ఖయం అయినప్పటికీ.. వైస్ కెప్టెన్ పదవి మాత్రం దక్కదని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్ పదవిని సంజూ శాంసన్ కు ఇవ్వడానికే ఎక్కువ మెుగ్గుచూపుతున్నట్లు క్రికెట్ వర్గాల విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి పంత్ కు కాకుండా.. శాంసన్ కు వైస్ కెప్టెన్ పగ్గాలు ఇవ్వనుండంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.