SNP
Gautam Gambhir, Santa Jayasurya, IND vs SL: టీమిండియా మాజీ క్రికెటర్, తాజా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య మధ్య మిని యుద్ధమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Gautam Gambhir, Santa Jayasurya, IND vs SL: టీమిండియా మాజీ క్రికెటర్, తాజా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య మధ్య మిని యుద్ధమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
గౌతమ్ గంభీర్, సనత్ జయసూర్య.. ఇద్దరూ మాజీ క్రికెటర్లు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఏ టోర్నీలోనూ, ఏ లీగ్‌లోనూ ఆడటం లేదు. మరి అయితే ఇద్దరి మధ్య గొడవేంటి అని అనుకుంటున్నారా? ఇద్దరి మధ్య ఇప్పుడు యుద్ధం ఆటగాళ్లుగా కాదులేండి.. హెడ్ కోచ్‌లుగా. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భారత జట్టు హెడ్ కోచ్ నియమిస్తూ.. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నెల చివర్లలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
మరోవైపు శ్రీలంక కూడా తమ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను నియమించింది. ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యను హెడ్ కోచ్‌గా నియమించింది లంక క్రికెట్ బోర్డు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన శ్రీలంక జట్టు కొంతకాలంగా పసికూన జట్టులా ఆడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఇలా దీన స్థితిలో ఉన్న శ్రీలంకకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్చల్లో భాగంగా జయసూర్య అయితేనే కరెక్ట్ అనుకొని, అతనైతేనే లంక క్రికెట్‌ను గాడిలో పెడతాడంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు హెడ్ కోచ్ బాధ్యతలు జయసూర్యకు అప్పగించింది.
జయసూర్య కూడా భారత్-శ్రీలంక సిరీస్‌తోనే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు భారత జట్టు.. శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. అయితే.. ఈ రెండు సిరీస్‌లలో సత్తా చాటాలని రెండు టీమ్స్ పట్టుదలగా ఉన్నాయి. పైగా హెడ్ కోచ్‌లుగా ఇటు గంభీర్‌కు, అటు జయసూర్యకు ఇదే ఫస్ట్ సిరీస్. సో.. కోచ్‌లుగా తమ జర్నీని సక్సెస్‌తో మొదలుపెట్టాలని ఇద్దరు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు హెడ్ కోచ్ సక్సెస్ అవుతారో చూడాలి. ఆటగాళ్లుగా గతంలో గ్రౌండ్‌లో తలపడిన గంభీర్, జయసూర్య.. ఇప్పుడు కోచ్‌లుగా జట్లను ముందు పెట్టి పోటీ పడనున్నారు. ఈ ఇద్దరు హెడ్ కోచ్‌లపై మధ్య ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Can’t wait for the India 🇮🇳 vs Sri Lanka 🇱🇰 series. It will be Sanath Jayasuriya vs Gautam Gambhir show.🔥🔥#GautamGambhir#SanathJayasuriya pic.twitter.com/wvLDMgYYSm
— Subhamoy Banerjee (@Subham2021) July 9, 2024