iDreamPost
android-app
ios-app

టీమ్​లో వాళ్లకు నో ఛాన్స్.. వెయిట్ చేయాల్సిందే: గంభీర్

  • Published Sep 18, 2024 | 8:41 PM Updated Updated Sep 18, 2024 | 8:41 PM

Gautam Gambhir Speaks On Sarfaraz Khan Fate: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి జరగబోయే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన.

Gautam Gambhir Speaks On Sarfaraz Khan Fate: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి జరగబోయే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన.

  • Published Sep 18, 2024 | 8:41 PMUpdated Sep 18, 2024 | 8:41 PM
టీమ్​లో వాళ్లకు నో ఛాన్స్.. వెయిట్ చేయాల్సిందే: గంభీర్

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో గెలుపుతో రెండు టెస్టుల ఈ సిరీస్​లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. పాకిస్థాన్ మీద గెలిచామని భారత్​ను కూడా ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేస్తున్న బంగ్లాను తొలి మ్యాచ్​లోనే చిత్తుగా ఓడిస్తే అదిరిపోతుందని అనుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తమ బెస్ట్ ఎఫర్ట్ పెట్టి అపోజిషన్ టీమ్​ను ఎక్కడా లేవకుండా చూడాలని అనుకుంటోంది. ఈ తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫస్ట్ టెస్ట్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్​పై ఆయన రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దరికీ జట్టులో చోటు ఇవ్వడం లేదన్నాడు.

అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో టీమిండియా స్క్వాడ్​ బలంగా కనిపిస్తోంది. స్పిన్, పేస్, బ్యాటింగ్.. ఇలా ఏ విభాగం తీసుకున్నా బెస్ట్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. చాలా ఆప్షన్స్ రెడీగా ఉండటంతో బంగ్లాదేశ్​తో జరిగే తొలి టెస్ట్​కు భారత ప్లేయింగ్ ఎలెవన్​లో ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్​లో కోచ్ గంభీర్ కొంత స్పష్టత ఇచ్చాడు. ముఖ్యంగా ఇద్దరు యంగ్ ప్లేయర్స్ భవితవ్యంపై తేల్చేశాడు. వాళ్లకు టీమ్​లో నో ఛాన్స్ అన్నాడు. గౌతీ చెప్పింది యంగ్ బ్యాటర్స్ సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ గురించే. వీళ్లిద్దరికీ తుదిజట్టులో ప్లేస్ లేదన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు కోసం వీళ్లు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదన్నాడు గౌతీ. అయితే అవకాశాలు రావని అనుకోవద్దంటూ ఫ్యూచర్​పై భరోసా ఇచ్చాడు.

‘మా టీమ్​లో ఎవర్నీ తొలగించడాలు ఉండవు. ప్లేయింగ్ ఎలెవన్​కు అవసరమైన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటాం. మ్యాచ్, కండీషన్స్, సిచ్యువేషన్​ను బట్టి ఎవర్ని తుదిజట్టులోకి తీసుకోవాలనేది డిసైడ్ అవుతాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. కానీ రిషబ్ పంత్ టీమ్​లోకి వస్తే అతడు బెంచ్​పై కూర్చోక తప్పదు. కొన్నిసార్లు ఈ ఎదురుచూపులు తప్పవు. మరో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. వీళ్లిద్దరికీ భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. కానీ ప్రస్తుతానికి టీమ్​లో చోటు లేదు. వీళ్లు వెయిట్ చేయాల్సిందే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. గౌతీ కామెంట్స్​తో ప్లేయింగ్ ఎలెవన్​లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉండటం ఖాయమైంది. దీంతో దాదాపుగా తుదిజట్టుపై ఓ అంచనా వచ్చేసింది. మరి.. జురెల్, సర్ఫరాజ్​ వెయిట్ చేయాల్సిందే అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.