iDreamPost
android-app
ios-app

గంభీర్‌పై విమర్శలు! CSKపై కోపం.. KKRపై ప్రేమతో జట్టు ఎంపిక!

  • Published Jul 19, 2024 | 1:51 PM Updated Updated Jul 19, 2024 | 1:51 PM

Gautam Gambhir, CSK, KKR, IND vs SL: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్‌ ఫేవరేటిజం చూపించాడని, సీఎస్‌కే కోపం, కేకేఆర్‌ ప్రేమతోనే జట్టు ఎంపికలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, CSK, KKR, IND vs SL: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్‌ ఫేవరేటిజం చూపించాడని, సీఎస్‌కే కోపం, కేకేఆర్‌ ప్రేమతోనే జట్టు ఎంపికలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 19, 2024 | 1:51 PMUpdated Jul 19, 2024 | 1:51 PM
గంభీర్‌పై విమర్శలు! CSKపై కోపం.. KKRపై ప్రేమతో జట్టు ఎంపిక!

శ్రీలంక పర్యటన కోసం టీ20, వన్డే టీమ్స్‌ను ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు లంకకు వెళ్లనుంది టీమిండియా. ఈ రెండు సిరీస్‌ల కోసం గురువారం టీమ్స్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ఎంపికతో భారత సెలెక్టర్లు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు. టీ20 కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌, వన్డే వైస్‌ కెప్టెన్‌ ఇలా అన్ని పోస్టులు భర్తీ చేశారు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన టీ20 కెప్టెన్‌ పోస్ట్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌తో భర్తీ చేసింది బీసీసీఐ. అలాగే టీ20 వైస్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాను తప్పిస్తూ.. శుబ్‌మన్‌ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటు వన్డే టీమ్‌కు కూడా అతన్నే వైస్‌ కెప్టెన్‌ని చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్‌ కోసం ఎంపిక చేసిన జట్ల విషయంలో గౌతమ్‌ గంభీర్‌ దారుణంగా ఫేవరేటిజం చూపించాడంటూ అతనిపై విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌లో రెగ్యులర్‌ ఆడే ప్లేయర్‌పై వివక్షను చూపించి.. తాను మెంటర్‌గా పనిచేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లో ఆడే ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో టాలెంట్‌ ఉన్నా, తాజాగా ముగిసిన జింబాబ్వే టూర్‌లో రాణించినా.. సీఎస్‌కే కెప్టెన్‌ అని రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు రవీంద్ర జడేజాను పూర్తిగా పక్కనపెట్టేశాడంటూ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే.. శివమ్‌ దూబే విషయంలో మాత్రం గంభీర్‌ కాస్త కనికరం చూపించాడంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ధోనిపై ఉన్న కోపాన్ని సీఎస్‌కే ప్లేయర్లు అయిన రుతురాజ్‌, జడేజాపై చూపించాడంటూ మండిపడుతున్నారు.

ఇక కేకేఆర్‌ విషయానికి వస్తే.. ఐపీఎల్‌ 2024లో గంభీర్‌ ఆ జట్టుకు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే తన కెప్టెన్సీలో 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిపాడు. అలా కేకేఆర్‌తో గంభీర్‌ మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతోనే ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను అలాగే కొత్త బౌలర్‌ హర్షిత్‌ రాణాను కూడా టీమ్‌లోకి తీసుకున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌ను నేరుగా వన్డే టీమ్‌లో తీసుకున్నాడంటూ కొంతమంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేకేఆర్‌కు ఆడిన గిల్‌కు వైస్‌ కెప్టెన్సీ, తన అండర్లో కేకేఆర్‌ తరఫున ఆడని సూర్యకుమార్‌ యాదవ్‌కు టీ20 కెప్టెన్సీ ఇప్పించాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. జట్టు ఎంపిక విషయం అంతా సెలెక్టర్లు చూసుకున్నా.. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ సూచనలతోనే ఈ ఎంపిక జరిగినట్లు క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.