iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: ఫ్యాన్ వార్ మొదలుపెట్టిన గంభీర్.. కోహ్లీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో?

  • Published Apr 20, 2024 | 5:04 PM Updated Updated Apr 20, 2024 | 5:04 PM

కోల్ కత్తా మెంటర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ ఫ్యాన్ వార్ ను మెుదలుపెట్టేలా ఉన్నాయి. ఆ కామెంట్స్ పై ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కోల్ కత్తా మెంటర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ ఫ్యాన్ వార్ ను మెుదలుపెట్టేలా ఉన్నాయి. ఆ కామెంట్స్ పై ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gautam Gambhir: ఫ్యాన్ వార్ మొదలుపెట్టిన గంభీర్.. కోహ్లీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో?

IPLలో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న టీమ్స్ ఏవంటే? చాలా మందికి గుర్తొంచే పేర్లు రెండే రెండు.. ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకోటి చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లకు విపరీతమైన అభిమానగనం ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మిగతా జట్ల విషయానికి వస్తే.. పై టీమ్స్ కంటే కాస్త తక్కువ ఫ్యాన్ బేస్ ని కలిగి ఉన్నాయి. అయితే తాజాగా కోల్ కత్తా మెంటర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ ఫ్యాన్ వార్ ను మెుదలుపెట్టేలా ఉన్నాయి. కేకేఆర్ టీమ్ మోస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కోల్ కత్తా నైట్ రైడర్స్.. ఈ ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లో దుమ్మురేపింది. ఆ తర్వాత కొంత డల్ అయ్యింది. అయినప్పటికీ వన్ ఆఫ్ ది టఫ్ టీమ్ కేకేఆర్. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. కేకేఆర్ మెంటర్ గా ఆ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ చేసిన కామెంట్స్ ఐపీఎల్ లో ఫ్యాన్ వార్ మెుదలుపెట్టే విధంగా ఉన్నాయి. గంభీర్ మాట్లాడుతూ..

Gambhir

“నేను నిజాయితీగా చెబుతున్నాను కేకేఆర్ టీమ్ ఈ కంట్రీలో నమ్మకమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. అభిమానులు మాకు ఎప్పటికీ అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ విషయం గతాన్ని చూస్తే తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ మా విన్నింగ్ చూడటానికి గ్రౌండ్ కు ప్రేక్షకులు వస్తారు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి.. ఫలితం అదే వస్తుంది. ఐపీఎల్ స్టార్టింగ్ లో తొలి 3 సంవత్సరాలు మా ఫ్యాన్స్ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటినీ తట్టుకుని వారు మాకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి అభిమానులు దేశం మెుత్తం మీద ఒక్క కేకేఆర్ కే ఉన్నారని సగర్వంగా చెప్పగలను” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం గంభీర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లతో పాటుగా విరాట్ కోహ్లీ అభిమానులు, ఆర్సీబీ ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎందుకంటే? ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ ను నమ్మకమైన అభిమానులుగా అంటారు. కానీ ఇప్పుడు గంభీర్ చేసిన కామెంట్స్ వారి కంటే.. కంట్రీలో మాకే నమ్మకమైన అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంటే ఆర్సీబీకి ఉన్న వారు లాయల్ కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు గంభీర్ ఫ్యాన్ వార్ కు తెర లేపుతున్నాడు అంటూ సరికొత్త వాదన తీసుకొస్తున్నారు. కాగా.. ఈ విషయంపై కోహ్లీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారోచూడలి. మరి గౌతమ్ గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet