Gautam Gambhir: సీనియర్స్​కు ప్రెస్​మీట్​లోనే గంభీర్ వార్నింగ్! ఇన్​డైరెక్ట్​గా ఇచ్చిపడేశాడు!

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్​గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్​గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్​గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు. వచ్చీ రాగానే టీ20 టీమ్​ కెప్టెన్ పోస్ట్​ను భర్తీ చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పడంతో అతడి ప్లేస్​లో సూర్యకుమార్ యాదవ్​కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోటీ నెలకొన్నా సూర్యకే ఆ పదవి దక్కింది. నిత్యం గాయాలతో సావాసం చేసే పాండ్యాను కాదని.. టీ20 స్పెషలిస్ట్​గా ముద్రపడిన మిస్టర్ 360కి సారథ్య పగ్గాలు అప్పగించాడు గంభీర్. లంక సిరీస్​కు వెళ్లే ముందు పలు ఇతర విషయాల మీద కూడా అతడు క్లారిటీ ఇచ్చాడు.

చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్​తో కలసి ప్రెస్​మీట్​లో పాల్గొన్న గంభీర్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్​గా ఉంటే వన్డే వరల్డ్ కప్-2027 వరకు కంటిన్యూ అవుతారని చెప్పాడు. కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాను లంక సిరీస్​కు ఎంపిక చేయనంత మాత్రాన అతడ్ని వన్డేల నుంచి పూర్తిగా పక్కనబెట్టినట్లు కాదన్నాడు. వన్డేలతో పాటు టెస్టుల్లో అతడు టీమ్​కు ఎంతో ముఖ్యమైన ప్లేయర్ అని స్పష్టం చేశాడు గౌతీ. సూర్యను కేవలం టీ20లకే పరిమితం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. ప్రెస్​మీట్​లో భారత క్రికెట్​కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకుంటూ వచ్చిన గంభీర్.. సీనియర్లకు కూడా ఇచ్చిపడేశాడు.

ఇక నుంచి డ్రెస్సింగ్ రూమ్​లో సీనియర్ల డామినేషన్ కుదరదంటూ ఇన్​డైరెక్ట్​గా వార్నింగ్ ఇచ్చాడు గంభీర్. టీమ్ గేమ్స్ విషయంలో ప్రతి ఆటగాడికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనేది తన సిద్ధాంతమన్నాడు. ‘ప్రతి ప్లేయర్​కు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది ఎంతో ముఖ్యం. నేను దీన్ని ఎంతగానో నమ్ముతా. ఏ బంధమైనా నమ్మకం మీదే నిలబడుతుంది. నేను విషయాలను కాంప్లికేట్ చేయాలనుకోవడం లేదు. ఆటగాళ్లకు అండగా నిలవడం నా బాధ్యతగా భావిస్తా. డ్రెస్సింగ్ రూమ్​ ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలి. సక్సెస్​ఫుల్ టీమ్​ బాధ్యతలు నా మీద ఉన్నాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాంప్లికేట్ చేయాలనుకోవడం లేదు, డ్రెస్సింగ్ రూమ్ హ్యాపీగా ఉండాలంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు నేరుగా సీనియర్లను టార్గెట్ చేసినవేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ ప్రెస్​మీట్ ద్వారా ప్రతి ఆటగాడికి స్వేచ్ఛ ఉంటుందని.. కొందరు ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనేది లేదని గంభీర్ చెప్పకనే చెప్పాడంటున్నారు. మరి.. సీనియర్ ఆటగాళ్లకు గౌతీ ఇన్​డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments