iDreamPost
android-app
ios-app

మినీ IPL.. అందరికీ ఆడే అవకాశం! సెలెక్ట్‌ అయితే రూ.3 లక్షలు పక్కా

  • Published Jul 22, 2024 | 3:22 PM Updated Updated Jul 22, 2024 | 3:22 PM

ISPL Season 2, Registration: టాలెంట్‌ ఉన్న యువ క్రికెటర్లతో పాటు క్రికెట్‌ అంటే ఇష్టం ఉండి.. బాగా ఆడతాం అని నమ్మకం ఉన్న వాళ్లకి ఇదో సువర్ణ అవకాశం. టెన్నిల్‌ బాల్‌ లీగ్‌ ఆడేందుకు సెలెక్ట్‌ అయితే రూ.3 లక్షలు అంతకంటే ఎక్కువే పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ISPL Season 2, Registration: టాలెంట్‌ ఉన్న యువ క్రికెటర్లతో పాటు క్రికెట్‌ అంటే ఇష్టం ఉండి.. బాగా ఆడతాం అని నమ్మకం ఉన్న వాళ్లకి ఇదో సువర్ణ అవకాశం. టెన్నిల్‌ బాల్‌ లీగ్‌ ఆడేందుకు సెలెక్ట్‌ అయితే రూ.3 లక్షలు అంతకంటే ఎక్కువే పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jul 22, 2024 | 3:22 PMUpdated Jul 22, 2024 | 3:22 PM
మినీ IPL.. అందరికీ ఆడే అవకాశం! సెలెక్ట్‌ అయితే రూ.3 లక్షలు పక్కా

గల్లీ క్రికెటర్లకు తమని తాము నిరూపించుకునే అవకాశం కల్పిస్తోంది ఐఎస్‌పీఎల్‌(ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌) సెషన్‌-2 త్వరలోనే ప్రారంభం కానుంది. 2025 జనవరి 31 నుంచి ఫిబ్రవరీ 9వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. టెన్నిస్‌ బాల్‌తో జరిగే ఈ లీగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. అందుకోసం.. ముందుగా ట్రైయల్స్‌లో ఆడాలి. అందులో ప్రతిభ చూపితే.. వేలానికి అర్హత సాధిస్తారు. ఆ వేలంలో ఏదో ఒక ఫ్రాంచైజ్‌ మిమ్మల్ని కొనుగోలు చేస్తుంది. మొత్తంగా ఈ ఐఎస్‌పీఎల్‌ను ఒక మినీ ఐపీఎల్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో ఈ లీగ్‌ జరిగింది. అది సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో.. రెండో సెషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గల్లీ క్రికెట్‌ టాలెంట్‌ను దేశానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ టెన్నిస్‌ బాల్‌ లీగ్‌ కోసం నిర్వహించే ట్రైయల్స్‌లో పాల్గొనాలంటే.. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. https://www.ispl-t10.com/registration-user ఈ లింక్‌ను ఓపెన్‌ చేసి అక్కడ అడిగే వివరాలు నమోదు చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత.. ట్రైయల్స్‌ నిర్వహిస్తారు. ట్రైయల్స్‌లో మంచి ప్రతిభ కనబరిస్తే.. వేలానికి ఎంపిక చేస్తారు. దేశంలోని 25 ప్రాంతాల్లో ఈ ట్రైయల్స్‌ జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలో ట్రైయల్స్‌ జరుగుతాయి. టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌లో బాగా ఆడతాం అనుకునే వాళ్లు.. వెంటనే రిజిస్ట్రర్‌ చేసుకుంటే.. మినీ ఐపీఎల​్‌లో ఆడే అవకాశం రావొచ్చు.

ట్రైయల్స్‌లో ప్రతిభ కనబర్చి.. వేలానికి అర్హత సాధిస్తే.. ఆరు ఫ్రాంచైజీల్లో ఏదో ఒకటి మిమ్మల్ని టీమ్‌లోకి తీసుకుంటే.. బేస్‌ ‍ప్రైజ్‌ కింద్‌ రూ.3 లక్షలు గ్యారెంటీగా దక్కుతాయి. ఒక వేళ అంత కంటే ఎక్కువ పెట్టి.. మీ కోసం రెండు మూడు ఫ్రాంచైజీలు పోటీ పడితే.. మీపై లక్షల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ఐఎస్‌పీఎల్‌లో టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా, శ్రీనగర్‌కే వీర్‌, కేవీఎన్‌ బెంగళూరు స్ట్రైకర్స్‌, ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సింగమ్స్‌, మజీ ముంబై జట్లు పాల్గొంటాయి. శ్రీనగర్‌ టీమ్‌కు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఓనర్‌గా ఉన్నాడు. అలాగే ముంబైకి అమితాబ్‌ బచ్చన్‌, బెంగళూరుకు హృతిక్‌ రోషన్‌, హైదరాబాద్‌కు గ్లోబుల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కోల్‌కత్తాకు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ ఖాన్‌, చెన్నైకి ‍హీరో సూర్య ఓనర్స్‌గా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రిజిస్టర్‌ చేసుకుని.. స్ట్రీట్‌ లీగ్‌లో మీ టాలెంట్‌ను చూపించండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet