iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: టీమిండియాకు గంభీర్ స్ట్రాంగ్ మెసేజ్.. కచ్చితంగా పాటించాల్సిందేనంటూ..!

  • Published Jul 12, 2024 | 3:35 PM Updated Updated Jul 12, 2024 | 3:35 PM

Team India: టీమిండియా నయా కోచ్​గా ఎంపికైన గౌతం గంభీర్ అప్పుడే తన మార్క్​ను చూపిస్తున్నాడు. కోచ్​గా ఇంకా ఒక్క సిరీస్ కూడా కాకముందే ఆటగాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు గౌతీ.

Team India: టీమిండియా నయా కోచ్​గా ఎంపికైన గౌతం గంభీర్ అప్పుడే తన మార్క్​ను చూపిస్తున్నాడు. కోచ్​గా ఇంకా ఒక్క సిరీస్ కూడా కాకముందే ఆటగాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు గౌతీ.

  • Published Jul 12, 2024 | 3:35 PMUpdated Jul 12, 2024 | 3:35 PM
Gautam Gambhir: టీమిండియాకు గంభీర్ స్ట్రాంగ్ మెసేజ్.. కచ్చితంగా పాటించాల్సిందేనంటూ..!

భారత క్రికెట్​లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముగియడంతో టీమ్ మేనేజ్​జ్​మెంట్ టోటల్ ఛేంజ్ అయింది. కొత్త కోచ్​గా లెజెండ్ గౌతం గంభీర్​ను నియమించింది బీసీసీఐ. పొట్టి కప్పుతో రోహిత్ సేన స్వదేశానికి తిరిగొచ్చిన కొద్ది రోజుల తర్వాత కోచ్​ ఎంపికపై ప్రకటన చేసింది బోర్డు. ఈ నెలాఖరులో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​తో గంభీర్​ కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ లోపే సపోర్టింగ్ స్టాఫ్ సెలెక్షన్​ కూడా ముగియనుందని తెలుస్తోంది. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్​, ఫిజియో.. ఇలా తనకంటూ కొత్త స్టాఫ్​ను ఎంచుకునే స్వేచ్ఛను బోర్డు కల్పించడంతో గంభీర్​ ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో మునిగిపోయాడు. బౌలింగ్ కోచ్ పదవి కోసం జహీర్ ఖాన్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ తదితరుల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​కు అసిస్టెంట్ కోచ్​గా ఉన్న అభిషేక్ నాయర్​ను కూడా టీమ్ మేనేజ్​మెంట్​లోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తోంది. ఫీల్డింగ్ కోచ్​గా లక్నో సూపర్ జియాంట్స్​లో తనలో కలసి వర్క్ చేసిన జాంటీ రోడ్స్​ను తీసుకొద్దామని అనుకున్నా.. అందుకు బోర్డు ససేమిరా వద్దన్నట్లు సమాచారం. స్వదేశీ కోచ్​లను ఎంచుకోవాలని సూచించినట్లు వినికిడి. ఒకవైపు సహాయక సిబ్బందిని సెలెక్ట్ చేసే పనుల్లో బిజీగా ఉన్న గంభీర్.. ఓ విషయంలో టీమిండియా ఆటగాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. తన మాట వినాల్సిందేనంటూ సున్నితంగా హెచ్చరించాడు. ఫిట్​గా ఉన్న ప్లేయర్లంతా మూడు ఫార్మాట్లలో ఆడి తీరాల్సిందేనని.. ఏ సాకులూ చెప్పొద్దని అతడు స్పష్టం చేశాడు.

‘ఏ ఆటగాడైనా ఫిట్​గా ఉన్నాడంటే అతడి కచ్చితంగా మూడు ఫార్మాట్లలోనూ ఆడి తీరాలి. ఫిట్​గా లేరు, గాయాలతో బాధపడుతున్నారంటే.. వెళ్లి రికవర్ అయి రావాలి. ఇంటర్నేషనల్ క్రికెట్​ఆడుతున్నామంటే ఆటగాళ్లు ఫిజికల్​గా, మెంటల్​గా స్ట్రాంగ్​గా ఉండాలి. ఏ టాప్ క్రికెటర్​ను అయినా అడగండి.. మూడు ఫార్మాట్లూ తమకు ముఖ్యమనే చెబుతారు. అంతేగానీ రెడ్ బాల్ క్రికెట్ లేదా వైట్ బాల్ క్రికెట్​కే తాము పరిమితం అవుతామని చెప్పరు. ఆటగాళ్లు అన్నాక గాయాలు అవుతుంటాయి. ఇది సర్వసాధారణం. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఆడితే ఇంజ్యురీల బారిన పడక తప్పదు. అప్పుడు వెళ్లి రికవర్ అయి మళ్లీ రావాలి. కానీ ఆడమని సాకులు చెప్పొద్దు’ అని గంభీర్ కుండబద్దలు కొట్టాడు. ఫామ్​లో ఉన్నప్పుడు దేశానికి వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడి గెలిపించాలని, తమ కెరీర్​ స్పాన్​ను ప్లేయర్లు సరిగ్గా వినియోగించుకోవాలని సూచించాడు. మరి.. ప్రతి ప్లేయర్ మూడు ఫార్మాట్లలో ఆడి తీరాల్సిందేనంటూ గంభీర్ హుకుం జారీ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.