SNP
Gautam Gambhir, IND vs SL: లంకపై మూడో టీ20లో ఏదో లక్ కొద్ది టీమిండియా గెలిచిందని కొంతమంది అనుకుంటున్నారు.. అయితే.. ఇది లక్ కాదు.. ప్యూర్‌గా గంభీర్ వేసిన ట్రాప్‌లో లంక పడి గిలగిలా కొట్టుకుంది. ఆ ట్రాప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, IND vs SL: లంకపై మూడో టీ20లో ఏదో లక్ కొద్ది టీమిండియా గెలిచిందని కొంతమంది అనుకుంటున్నారు.. అయితే.. ఇది లక్ కాదు.. ప్యూర్‌గా గంభీర్ వేసిన ట్రాప్‌లో లంక పడి గిలగిలా కొట్టుకుంది. ఆ ట్రాప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకలె వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా అద్భుతమే చేసింది. ఆల్‌మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌లో.. గెలిచి ఔరా అనిపించింది. ఊహకందని విధంగా సాగిన ఈ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సూపర్ ఓవర్‌కు వెళ్లింది.. అంతిమంగా భారత జట్టు విజేతగా నిలిచింది. గెలుపు వాకింట్లోకి వచ్చిన లంక.. ఒత్తిడికి చిత్తై.. సింపుల్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే.. ఈ విజయం ఏదో గాలివాటు విజయం అని కొంతమంది భావించవచ్చు.. పార్ట్‌టైమ్ స్పిన్నర్లకు లక్కీగా వికెట్లు పడ్డాయి.. అందుకే టీమిండియా గెలిచిందనే కామెంట్ల రావొచ్చు.. కానీ, ఇది గాలవాటం గెలుపుకాదు.. గంభీర్ అనే ఓ మాస్టర్ మైండ్ పడిన కష్టం ఉంది దీని వెనుక. అదేంటో ఇప్పుడు చూద్దాం..
లంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 138 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోగలిగింది. రెగ్యులర్ బౌలర్లు సిరాజ్, వాషింగ్టన్ సుందర్ బాగా బౌలింగ్ చేసినా.. చివర్లో అద్భుతం చేసింది మాత్రమ పార్ట్‌టైమ్ స్పిన్నర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పాలి. తమ కెరీర్‌లోనే తొలిసారి బౌలింగ్ చేస్తూ.. ఒక్క ఓవర్‌లోనే రెండేసి వికెట్లు తీసుకున్నారు ఇద్దరు బౌలర్లు. పైగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో.. ఇన్నింగ్స్ 19, 20వ ఓవర్లు వేశారు. అంత ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి ఇండియాను గెలిపించారు. రింకూ సింగ్ 3, సూర్య 5 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండేసి వికెట్లు తీసుకొని.. మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు.
జనరల్‌గా అయితే.. టీ20 వరల్డ్ కప్ 2024 వరల్డ్ కప్ వరకు భారత టీ20 జట్టులో ఉన్న పరిస్థితి దృష్ట్యా.. చివరి రెండు ఓవర్లు కూడా రెగ్యులర్ బౌలర్లు.. సిరాజ్, ఖలీల్ అహ్మద్ వేసే వారు. కానీ, ఇక్కడ గంభీర్ తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించి.. రింకూ, సూర్యను బరిలోకి దింపి.. లంకకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీళ్లిద్దరు ఎలా వేస్తారో కూడా లంకకు కనీసం ఐడియా లేదు. అయితే.. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన గంభీర్.. అందుకోసం జట్టులోని చాలా మంది బ్యాటర్లంతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకుని.. ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ వచ్చిన ప్రతి బ్యాటర్‌తో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. అవసరం వస్తే.. ఎవరైనా సరే బౌలింగ్‌కు సిద్ధంగా ఉండాలని సూచించాడు.
నిన్నటి మ్యాచ్‌లో 12 బంతుల్లో 9 పరుగుల అనేసరికి.. లంక బ్యాటర్లు రిలాక్స్ అయిపోయారు.. విజయం ఖాయం అనుకున్నారు. కానీ, ఇక్కడే గంభీర్ తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించి.. లంకను ట్రాప్‌లో పడేశాడు. 19వ ఓవర్‌లో రింకూని దింపాడు.. రింకూను చూసి.. లంక బ్యాటర్లలో కన్ఫ్యూజన్ మొదలైంది. లంక షాక్‌లో ఉండగానే.. సూర్యను కూడా దింపేసి.. రెండు ఓవర్లు పూర్తి చేయించాడు.. మ్యాచ్‌ను టై చేసి.. సూపర్ ఓవర్‌తో మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేసి.. అద్బుతమైన స్టార్ట్ అందుకున్నాడు. అందుకే.. ఇది మిరాకిల్ విజయం కాదు.. గంభీర్ ముందుచూపు, మాస్టర్ మైండ్ వల్ల దక్కిన విజయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Backing pic.twitter.com/24N8Xtnzcg
— Priyansh (@bhhupendrajogi) July 30, 2024
That smile of satisfaction on the face of @GautamGambhir when all his strategies became fruitful 😍🙈❤️
Srilanka is whitewashed 3-0(3) under his coaching in his 1st series as Indian coach. The GAUTAM GAMBHIR era begins with a bang😎
Congratulations Gauti bhaiyaa and India 🇮🇳💙 pic.twitter.com/R8PlVzOx9j— Sukanya Chatterjee (@GautiSukanya) July 30, 2024