SNP
Gautam Gambhir, Team India: గౌతమ్ గంభీర్.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఇప్పుడు హెడ్ కోచ్‌గా తన తొలి మీడియా సమావేశం పూర్తి చేశాడు. తొలి ప్రెస్‌మీట్‌లో టీమిండియా ఆటగాళ్ల గురించి గట్టి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, Team India: గౌతమ్ గంభీర్.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఇప్పుడు హెడ్ కోచ్‌గా తన తొలి మీడియా సమావేశం పూర్తి చేశాడు. తొలి ప్రెస్‌మీట్‌లో టీమిండియా ఆటగాళ్ల గురించి గట్టి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన తర్వాత.. గౌతమ్ గంభీర్ తొలి ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నాడు. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి హెడ్ కోచ్ హోదాలో మీడియాతో మాట్లాడిన గంభీర్.. అందరూ ఊహించినట్లుగానే తొలి ప్రెస్‌మీట్‌లో సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. జట్టులోని ఆటగాళ్లంతా ఎల్లప్పుడూ.. తన వెనుక ఉంటూ తనకు వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఒకరకంగా తనకు ఆటగాళ్ల నుంచి పూర్తి సహకారం కావాలని కాస్త మర్యాదగా చెప్పినట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘నాకు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్లేయర్లంతా ఎల్లప్పుడూ నా వెనుక ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం హ్యాపీగా ఉండటం ఎంతో ముఖ్యం. నేను కూడా కొన్ని విషయాలను సంక్లిష్టం చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే.. నేను సక్సెస్‌ఫుల్ టీమ్‌కు కోచింగ్ ఇవ్వబోతున్నాను’ అంటూ గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఎక్కువగా యంగ్ ప్లేయర్లతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి మోడ్రన్ లెజెండ్స్ కూడా ఉన్నారు. కోహ్లీ అయితే ప్రస్తుతం ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్‌గా ఉన్నాడు. అలాంటి ఆటగాడిని సైతం గంభీర్ డీల్ చేయాలి. పైగా కోహ్లీ, గంభీర్ కలిసి ఒకప్పుడు ఇండియాకు ఆడినవాళ్లే.
క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐ కూడా ఈ విషయంలో కాస్త భయపడింది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను వాళ్లతో కలిసి ఆడిన గంభీర్ ఎలా ముందుకు సాగుతాడని, కానీ, గంభీర్ అందరి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టి.. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ ముందు వెళ్తానని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీతో తన మంచి అనుబంధం ఉందని, అలాగే తాను హెడ్ కోచ్‌గా నియామకం అయిన తర్వాత.. ఇద్దరం మెసేజ్‌లు చేసుకున్నట్లు కూడా గంభీర్ వెల్లడించాడు. ఇద్దరం కలిసి టీమిండియాను గెలిపించేందుకు ప్రయత్నిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే.. జట్టులోని ఆటగాళ్లంతా తన వెనుకే ఉండాలనే స్టేట్‌మెంట్‌పై క్రికెట్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ దాన్ని పాజిటివ్‌గానే చెప్పినా.. కొంతమంది నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir said, “the most important thing for me is players will always have my back. A happy dressing room is important. I don’t want to complicate things. I’m taking over a very successful team”. pic.twitter.com/TSojtKeQjS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2024