iDreamPost

Gautam Gambhir: లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వాళ్లు, టీమిండియా క్రికెట్ ను శాసిస్తున్నారు: గంభీర్

లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వాళ్లు, టీమిండియా క్రికెట్ ను శాసిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. మరి ఈ షాకింగ్ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వాళ్లు, టీమిండియా క్రికెట్ ను శాసిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. మరి ఈ షాకింగ్ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Gautam Gambhir: లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వాళ్లు, టీమిండియా క్రికెట్ ను శాసిస్తున్నారు: గంభీర్

గౌతమ్ గంభీర్.. ఎప్పుడూ ఏదో ఒక క్రికెటర్ పై లేదా, ఇతరులపై కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అతడు మాట్లాడిన మాటలు నిజమేనని అనిపించకమానవు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ ఇచ్చాక కూడా లీగ్ క్రికెట్ ఎందుకు ఆడతానో చెప్పిన సమాధానం ప్రతీ ఒక్కరిని కదిలించిందనే చెప్పాలి. 5 వేల మందికి భోజనం పెట్టేందుకు తాను తన సొంత డబ్బు రూ. 3 కోట్ల పైనే ఖర్చు చేస్తున్నానని, ఈ మనీని కామెంట్రీ, లీగ్ క్రికెట్ ఆడి సంపాదిస్తున్నా అంటూ ప్రపంచానికి తెలియజేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే టీమిండియా క్రికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టుకోని వాళ్లు భారత క్రికెట్ ను శాసిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

క్రికెట్.. గతంలో ఒక ఆటగానే అందరూ దీనిని చూసేవారు. కానీ రాను రాను ఈ ఆటలోకి రాజకీయాలు ప్రవేశించడంతో ఒక్కసారిగా ఈ గేమ్ ఒక వ్యాపారంగా మారింది. కాదు కాదు మార్చేశారు. ఇది నేనంటున్న మాట కాదు. గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. భారత క్రికెట్ ను బీసీసీఐ ఓ వ్యాపారంగా మార్చేసిందని, తమకు అనుకూలంగా ఉన్న ప్లేయర్లనే ఆకాశానికి ఎత్తేస్తూ, అవకాశాలు కల్పిస్తున్నారన్నది గత కొంతకాలంగా బీసీసీఐపై వస్తున్న ప్రధాన విమర్శ. ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా క్రికెట్ పై, బీసీసీఐపై ఈ విధంగా మాట్లాడుకొచ్చాడు.

ghambir shocking comments on jai sha

“తన లైఫ్ లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వ్యక్తి, గ్రౌండ్ లో లక్ష మంది ముందు ఒత్తిడిని ఎదుర్కొవడం ఎలాగో తెలియని వ్యక్తి ఇప్పుడు టీమిండియా క్రికెట్ ను శాసిస్తున్నాడు. అతడికి విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలీదు. కేవలం AC రూముల్లో కూర్చుని, వారికి అనుకూలంగా ఉండే ప్లేయర్లనే పైకి తెస్తున్నారు. అలాంటి వారికే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి మిగతా ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? అతడు టీమిండియా క్రికెట్ కు స్టేక్ హోల్డర్ కాదు.. అతడు కేవలం ఓ బిజినెస్ మెన్.. అలాగే ఆలోచిస్తాడు. క్రికెట్ పై డబ్బులు ఎలా రాబట్టాలో చూస్తాడు” అంటూ ఇప్పటి వరకు చేయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ కామెంట్స్ బీసీసీఐ సెక్రటరీ జై షాను ఉద్దేశించి చేసినవే అని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. గంభీర్ అన్న ప్రతీ మాట జై షాకు యాప్ట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీగా ఉన్న గంభీర్, అమిత్ షా కుమారుడు జై షాపై పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. మరి గౌతమ్ గంభీర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by M R GOURI (@themrsports)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి