iDreamPost
android-app
ios-app

నేను చూసిన ఇన్నింగ్స్​ల్లో అదే బెస్ట్.. కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన గంభీర్!

  • Published Sep 18, 2024 | 4:04 PM Updated Updated Sep 18, 2024 | 4:04 PM

Gautam Gambhir, Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

Gautam Gambhir, Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

  • Published Sep 18, 2024 | 4:04 PMUpdated Sep 18, 2024 | 4:04 PM
నేను చూసిన ఇన్నింగ్స్​ల్లో అదే బెస్ట్.. కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన గంభీర్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు పూర్తిగా కలసిపోయారు. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తమ మధ్య కోచ్-ప్లేయర్ రిలేషన్ ఉన్నప్పటికీ.. మరోవైపు ఫ్రెండ్​షిప్​ను కూడా కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు భారత్​కు కలసి ఆడిన ఈ ఇద్దరు స్టార్లు.. ఐపీఎల్​లో పలుమార్లు బాహాబాహీకి దిగారు. ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం లాంటివి జరిగాయి. అయితే గత సీజన్​తో అన్నింటికీ చెక్ పెట్టిన కోహ్లీ-గౌతీ తిగిరి ఫ్రెండ్​షిప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు టీమిండియాలో ఉండటంతో మరింత జోవియల్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ కలసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. క్రికెట్​తో పాటు ఇతర విషయాల గురించి కూడా ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ మీద ప్రశంసలు కురిపించిన గంభీర్.. అతడు ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో ఇన్నింగ్స్​లు చూశానని.. కానీ అన్నింటి కంటే పాకిస్థాన్​ మీద విరాట్ కోహ్లీ బాదిన 183 పరుగుల నాక్ గొప్పదన్నాడు గంభీర్. ఆసియా కప్​లో 300 పైచిలుకు స్కోరును ఛేజ్ చేస్తూ విరాట్ బ్యాటింగ్ చేసిన తీరు, భారీ సెంచరీతో జట్టును గెలిపించిన విధానం భేష్​ అని మెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్​లో భారత బ్యాటర్ల నుంచి వచ్చిన అతిగొప్ప ఇన్నింగ్స్ అంటే అదేనని తెలిపాడు. అలాంటిది మళ్లీ చూడలేదన్నాడు గౌతీ. తన కెరీర్​లో కోహ్లీ చాలా దూరం ప్రయాణించేశాడని, వచ్చే జనరేషన్ అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నాడు. కోహ్లీ బ్యాటర్​గానే కాదు.. కెప్టెన్​గానూ టీమిండియా మీద బలమైన ప్రభావం చూపించాడని మెచ్చుకున్నాడు గంభీర్. టెస్టుల్లో గెలవాలంటే 20 వికెట్లు తీయడం కంపల్సరీ అని గ్రహించి, బౌలర్లను ఎంకరేజ్ చేయడం, స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్​ను బిల్డ్ చేయడం గొప్ప విషయమన్నాడు.

బౌలింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉండేలా చూసుకోవడం వల్లే టెస్ట్ కెప్టెన్​గా కోహ్లీ అంత సక్సెస్ సాధించాడని తెలిపాడు గంభీర్. అతడి యాటిట్యూడ్, అగ్రెషన్ టీమ్​లో గెలవాలనే కసిని రగిలించిందన్నాడు. ఇదే యాటిట్యూడ్ ఓవర్సీస్​లో విజయాలకు కారణమైందన్నాడు. టెస్టులకు కోహ్లీ ఇచ్చిన ఇంపార్టెన్స్​ను మెచ్చుకోకుండా ఉండలేనని.. వచ్చే తరం ఇలాగే లాంగ్ ఫార్మాట్​ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు గౌతీ. విరాట్​లో ఇంకా పరుగుల దాహం తీరలేదని, వరల్డ్ బెస్ట్ బ్యాటర్​గా ఉండాలనే ఆకలి ఇంకా కొనసాగుతోందన్నాడు. ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉన్నందుకు ఇండియన్ క్రికెట్, ఫ్యాన్స్ గర్వపడాలంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు గంభీర్. ఏడాది ఆఖర్లో జరిగే ఆస్ట్రేలియా టూర్​లో కోహ్లీ చెలరేగి ఆడతాడని ఆశిస్తున్నానని వివరించాడు. ఇక, గంభీర్​కు అంతగా నచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ ఆసియా కప్-2012లో ఆడినది. పాక్ సంధించిన 329 పరుగుల ఛేదనలో కోహ్లీ (148 బంతుల్లో 183 రన్స్) భారీ సెంచరీతో వీరవిహారం చేయడంతో భారత్ అలవోకగా నెగ్గింది.