iDreamPost
android-app
ios-app

ప్రాక్టీస్​ సెషన్​లో ప్లేయర్లను పరుగులు పెట్టించిన గంభీర్.. అతడి పైనే ఎక్కువ ఫోకస్!

  • Published Jul 23, 2024 | 10:23 PM Updated Updated Jul 23, 2024 | 10:23 PM

Gautam Gambhir: టీమిండియా కొత్త కోచ్​ గౌతం గంభీర్ రావడం రావడమే తన మార్క్ చూపించేశాడు. తొలి ప్రాక్టీస్ సెషన్​లోనే ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు.

Gautam Gambhir: టీమిండియా కొత్త కోచ్​ గౌతం గంభీర్ రావడం రావడమే తన మార్క్ చూపించేశాడు. తొలి ప్రాక్టీస్ సెషన్​లోనే ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు.

  • Published Jul 23, 2024 | 10:23 PMUpdated Jul 23, 2024 | 10:23 PM
ప్రాక్టీస్​ సెషన్​లో ప్లేయర్లను పరుగులు పెట్టించిన గంభీర్.. అతడి పైనే ఎక్కువ ఫోకస్!

భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్​కు రెడీ అయిపోయింది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్​లో పాల్గొంది టీమిండియా. యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ సారథ్యంలో ఆ సిరీస్​ను 4-1తో సొంతం చేసుకుంది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మరో సిరీస్​కు సిద్ధమైపోయింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు 3 టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. జులై 27న జరిగే ఫస్ట్ టీ20తో ఈ సిరీస్​కు తెరలేవనుంది. ఆ తర్వాత వరుసగా రెండ్రోజుల్లో మరో రెండు మ్యాచ్​లు జరగనున్నాయి. దీంతో ఈ సిరీస్​కు మెన్ ఇన్ బ్లూ రెడీ అవుతున్నారు. కొత్త కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు.

గంభీర్ తొలి ప్రాక్టీస్ సెషన్​లోనే తన మార్క్ చూపించాడు. సీనియర్లు, జూనియర్లు అని చూడకుండా అందరు ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు. వాళ్లను చెమటలు కక్కించాడు. ఆటగాళ్లందరితో జాగింగ్, రన్నింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించాడు గౌతీ. అలాగే బ్యాటర్ల ట్రెయినింగ్​ను దగ్గర నుంచి నిశితంగా గమనించాడు. వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ ఎక్కువ సేపు సాధన చేశాడు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్​లో గంభీర్ ఎక్కువగా తన దృష్టిని స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీదే ఉంచాడు. అతడికి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పుతూ కనిపించాడు. బ్యాటింగ్ మెళకువల గురించి అతడితో డిస్కస్ చేశాడు. ఇదే ట్రెయినింగ్ సెషన్​లో హైలైట్​గా నిలిచింది.

సంజూతో పాటు ఇతర ఆటగాళ్లతోనూ గంభీర్ కలివిడిగా కనిపించాడు. అందరికీ దగ్గరగా ఉండి ప్రాక్టీస్ చేయించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​తో కాసేపు చర్చించిన గౌతీ.. ఆ తర్వాత టీమ్​మేట్స్ అందర్నీ ఒక చోటుకు పిలిచి మాట్లాడాడు. ప్రాక్టీస్ సెషన్, టీమ్ గోల్స్ గురించి వాళ్లతో డిస్కస్ చేసినట్లు అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, సంజూ బ్యాటింగ్​ను గతంలో పలుమార్లు గంభీర్ పొగిడిన సంగతి తెలిసిందే. అతడు చాలా క్వాలిటీ బ్యాటర్ అని, టీమిండియాలో పక్కా ఉండాల్సినోడని చెప్పాడు. ఇప్పుడు అతడికి చిట్కాలు ఇస్తూ కనిపించడంతో సంజూపై గౌతీ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక, లంక టూర్​లో టీ20లకు సెలెక్ట్ అయిన శాంసన్.. వన్డే టీమ్​లో చోటు దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కమ్​బ్యాక్ ఇవ్వడంతో అతడికి ప్లేస్ దక్కలేదు. మరి.. టీమ్​లో పర్మినెంట్ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్న సంజూ కెరీర్​ను గంభీర్ గాడిలో పెడతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.