iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: వీడియో: మోదీ పిలుపుతో ఆలయాన్ని శుభ్రం చేసిన టీమిండియా క్రికెటర్‌

  • Published Jan 17, 2024 | 8:13 PM Updated Updated Jan 17, 2024 | 8:13 PM

అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అపూర్వ కార్యక్రమం జరగనుంది. మరి.. అంతకంటే ముందు దేశవ్యాప్తంగా ఒక స్వచ్ఛంద కార్యక్రమం నడుస్తోంది. అందులో భారత క్రికెటర్‌ కూడా భాగం అయ్యాడు.

అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అపూర్వ కార్యక్రమం జరగనుంది. మరి.. అంతకంటే ముందు దేశవ్యాప్తంగా ఒక స్వచ్ఛంద కార్యక్రమం నడుస్తోంది. అందులో భారత క్రికెటర్‌ కూడా భాగం అయ్యాడు.

  • Published Jan 17, 2024 | 8:13 PMUpdated Jan 17, 2024 | 8:13 PM
Gautam Gambhir: వీడియో: మోదీ పిలుపుతో ఆలయాన్ని శుభ్రం చేసిన టీమిండియా క్రికెటర్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక విషయం గురించే చర్చ నడుస్తోంది. అదే అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చాలా మంది చాలా ఏళ్లుగా పోరాటం చేశారు. వారి పోరాట ఫలితంగా అయోధ్యలో రామమందిరం నిర్మితమవుతోంది. ప్రస్తుతం రామ మ​ందిరం గురించే ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 22న ఈ కార్యక్రమం జరగనుంది. అయితే.. ఈ ప్రత్యేకమైన రోజు కోసం దేశంలోని అన్ని ఆలయాలు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందుకోసం దేశంలోని ఆలయాలను స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకుని ఇప్పటికే చాలా మంది తమ తమ ప్రాంతాల్లోని ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో తన భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది సెలబ్రేటీలు సైతం ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా చేరిపోయారు. కరోల్‌ బాగ్‌లోని శివ్‌ మందిర్‌ను గంభీరే స్వయంగా క్లీన్‌ చేశారు. గంభీర్‌ గుడిని శుభ్రం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్‌ క్రికెటర్‌ అయి ఉండి కూడా ఎంతో వినమ్రంగా ఆలయాన్ని శుభ్రం చేస్తుండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, ఆలయాల శుభ్రం తర్వాత.. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలోనే జనవరి 22న అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ఠ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంత ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, ప్రతి ఆలయాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ఆలయాలను పలువురు స్వచ్ఛందగా శుభ్రం చేస్తున్నారు. మరి భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆలయాన్ని శుభ్రం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.