iDreamPost
android-app
ios-app

క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. 6 బంతుల్లో 6 వికెట్లు!

  • Author Soma Sekhar Published - 10:48 AM, Mon - 13 November 23

తాజాగా క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఓ బౌలర్ ఏకంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

తాజాగా క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఓ బౌలర్ ఏకంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

  • Author Soma Sekhar Published - 10:48 AM, Mon - 13 November 23
క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. 6 బంతుల్లో 6 వికెట్లు!

‘రికార్డులకు ఆయుష్షు తక్కువ’ అన్న సామెతను మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. ఏ క్రీడా రంగంలో అయినా బద్దలు కాని రికార్డులు అంటూ ఏవీ ఉండవు. ఇక క్రికెట్ లో రోజుకో రికార్డు బద్దలు అవ్వడమో.. లేక క్రియేట్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఎన్నో అద్భుత ఘనతలు సువర్ణాక్షరాలతో లిఖించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఓ బౌలర్ ఏకంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

క్రికెట్ చరిత్రలో అసాధ్యం కానీ రికార్డులు అంటూ ఏవీ లేవని మరోసారి రుజువైంది. ఎవ్వరూ ఊహించని చరిత్ర లిఖించాడు ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్. ఒకే ఓవర్లో 6 వికెట్లు పడగొట్టి నయా రికార్డు నెలకొల్పాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ థర్డ్ డివిజన్ క్లబ్ క్రికెట్ లో ఓ అద్భుత రికార్డు నమోదు అయ్యింది. ఈ క్లబ్ క్రికెట్ లో భాగంగా తాజాగా మడ్గీరబా వర్సెస్ సర్ఫర్స్ ప్యారడైజ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మడ్గీరబా టీమ్ బౌలర్ గారెత్ మోర్గాన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్యారడైజ్ జట్టు విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. ఇంకా వారిచేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో అందరూ ఆ జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని భావించారు.

అయితే ఇక్కడే ఓ అద్భుతం జరిగింది. గారెత్ మోర్గాన్ చివరి ఓవర్లో ఏకంగా 6 బంతుల్లో 6 వికెట్లు తీసి తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇందులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. ఇక 6 బాల్స్ లో 6 వికెట్లు తీసి నయా చరిత్ర సృష్టించాడు మోర్గాన్. కాగా.. క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఓవర్ లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓలివర్ వైట్ హౌస్ అనే 12 ఏళ్ల కుర్రాడు 6 బాల్స్ లో 6 వికెట్లు పడగొట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? అతడు ఆ మ్యాచ్ లో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 8 వికెట్లు పడగొట్టాడు. ఇంకో సందర్భంలో కూడా అలెడ్ కారీ అనే ఆసీస్ బౌలర్ క్లబ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తాజాగా గారెత్ మోర్గాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. మరి 6 బాల్స్ లో 6 వికెట్లు తీసిన గారెన్ మోర్గాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.