iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: ఆ ముగ్గురు స్టార్ల విషయంలో పట్టుదలకు పోతున్న గంభీర్.. లాభమా? నష్టమా?

  • Published Jul 16, 2024 | 8:40 PM Updated Updated Jul 16, 2024 | 8:40 PM

నయా హెడ్ కోచ్​ గౌతం గంభీర్ రాకతో భారత క్రికెట్​లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆటగాళ్ల విషయంలో అతడు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నయా హెడ్ కోచ్​ గౌతం గంభీర్ రాకతో భారత క్రికెట్​లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆటగాళ్ల విషయంలో అతడు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Published Jul 16, 2024 | 8:40 PMUpdated Jul 16, 2024 | 8:40 PM
Gautam Gambhir: ఆ ముగ్గురు స్టార్ల విషయంలో పట్టుదలకు పోతున్న గంభీర్.. లాభమా? నష్టమా?

భారత క్రికెట్​లో ఇప్పుడు కొత్త శకం మొదలైంది. టీ20 వరల్డ్ కప్-2024తో కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశాడు. అతడితో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్లు ముగ్గురూ ఇకపై వన్డేలు, టెస్టులకు పరిమితం కానున్నారు. అటు టీమ్ మేనేజ్​మెంట్​లో భాగమైన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. నయా హెడ్ కోచ్​గా లెజెండ్ గౌతం గంభీర్​ను నియమించింది బీసీసీఐ. దీంతో ఇండియన్ క్రికెట్​లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నాడు. ఆటగాళ్ల విషయంలో అతడు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిట్​గా ఉన్న ప్రతి ప్లేయర్ మూడు ఫార్మాట్లలోనూ కచ్చితంగా ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు గౌతీ. ఫిట్​నెస్, ఫామ్​ ఉన్నప్పుడే జాతీయ జట్టుకు సాధ్యమైనన్ని మ్యాచుల్లో ఆడాలని అంటున్నాడు. అదే టైమ్​లో ప్రతి ఆటగాడు నేషనల్ డ్యూటీగా దూరంగా ఉన్నప్పుడు డొమెస్టిక్ టోర్నమెంట్స్​లో ఆడుతూ ఫామ్​, ఫిట్​నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చెబుతున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నా భారత క్రికెట్ మూలస్తంభాలు లాంటి కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా విషయంలో అతడు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా ఊపిరి సలపని క్రికెట్ ఆడి అలసిపోయారు. వెంటవెంటనే ఐపీఎల్​తో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా ఆడారు.

Gambhir

రోహిత్-కోహ్లీకి వయసు పెరుగుతోంది. కెరీర్​ను ఎక్కువ కాలం పొడిగించుకోవాలంటే వాళ్లకు రెస్ట్ ఇవ్వడం ఎంతో అవసరం. అటు నిత్యం గాయాలతో సావాసం చేసే బుమ్రాను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రెస్ట్ లేకుండా ఆడుతూ వచ్చిన ఈ త్రిమూర్తులు త్వరలో జరిగే లంక సిరీస్​కు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. కానీ గంభీర్ మాత్రం వాళ్లు ఆడాల్సిందేనని పట్టుబడుతున్నాడని సమాచారం. లంకతో సిరీస్​ ముగిశాక బంగ్లాదేశ్​తో టెస్టుల్లో ఆడనుంది భారత్. ఈ రెండు సిరీస్​లకు మధ్య 42 రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి రోకో జోడీ, బుమ్రా రెస్ట్ తీసుకునేందుకు కావాల్సినంత టైమ్ దొరుకుతుందనేది గంభీర్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే లంక సిరీస్​లో ఆడి ఈ స్టార్లు గాయాలపాలైతే టీమ్​కు నష్టమని కొందరు ఎక్స్​పర్ట్స్ వాదిస్తున్నారు. గంభీర్ ప్లానింగ్​తో నష్టమే గానీ లాభం లేదని.. పట్టుబట్టి ఆడిస్తే ఆ ముగ్గురూ ఫీల్ అవ్వొచ్చని, ఇది జట్టుకు మంచిది కాదని సూచిస్తున్నారు. మరి.. రోహిత్-కోహ్లీ విషయంలో గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.