Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన ముగిసిన రెండో టెస్టులో టీమిండియా పేస్ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సౌతాఫ్రికాతో జరిగిన ముగిసిన రెండో టెస్టులో టీమిండియా పేస్ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు గ్రౌండ్ లో కొన్ని చిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఇక అవి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి. అయితే మ్యాచ్ తర్వాత జరిగే ప్రజెంటేషన్ కార్యక్రమాల్లో ఆటగాళ్లు తమ మాటలతో అప్పుడప్పుడు అక్కడ నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ముగిసిన రెండో టెస్టులో టీమిండియా పేస్ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు నవ్వులు పూయించారు. బౌలింగ్ లో చెలరేగి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు వీరిద్దరు. అయితే మ్యాచ్ తర్వాత ఇంగ్లీష్ తెచ్చిన తిప్పల కారణంగా నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మహ్మద్ సిరాజ్.. సౌతాఫ్రికాను వణికించిన స్టార్ బౌలర్. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ.. 6 వికెట్లతో చెలరేగాడు ఈ హైదరాబాదీ. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 1-1తో సమం చేసింది. సంచలన బౌలింగ్ తో చెలరేగిన మహ్మద్ సిరాజ్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అయితే మ్యాచ్ అనంతరం ఈ అవార్డు ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తనకు వచ్చిన అవార్డును అందుకున్న సిరాజ్ మాట్లాడటానికి హోస్ట్ దగ్గరికి వెళ్లాడు. ఇక అతడి వెనకాలే ట్రాన్స్ లేటర్ గా బుమ్రా వచ్చాడు. హోస్ట్ ప్రశ్న అడగ్గా.. సిరాజ్ తనకు వచ్చిన ఇంగ్లీష్ లోనే సమాధానాలు చెప్పడం మెుదలుపెట్టాడు. దీంతో బుమ్రా కళ్ళార్పకుండా సిరాజ్ వైపే చూస్తూ ఉన్నాడు. దీంతో యాంకరమ్మ బుమ్రా ఎందుకు వచ్చాడు? అని నవ్వుతూ అడగ్గా.. ఒక్కసారిగా బుమ్రా, సిరాజ్ లు గట్టిగా నవ్వారు.
కాగా.. సిరాజ్ కు అంత ప్లూయెంట్ గా ఇంగ్లీష్ రాదు. దీంతో ఇలాంటి ప్రజెంటేషన్ కార్యక్రమాల్లో అతడికి ట్రాన్స్ లేటర్ గా సహచర టీమిండియా క్రికెటర్లు వస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా బుమ్రా వచ్చాడు. అయితే తనను పిలిచి కూడా ఏం మాట్లాడనివ్వకపోవడంతో.. బుమ్రా అయోమయంగా చూస్తూ అలాగే నిలుచున్నాడు. నన్ను ఎందుకు పిలిచావ్ అన్నట్లుగా బుమ్రా చూశాడు. ఇంగ్లీష్ తెచ్చిన తిప్పలు ఎంతపని చేశాయి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సిరాజ్ కు ఇంగ్లీష్ కంటే హిందీ బాగా వస్తుంది. దీంతో అతడు హిందీలో సమాధానాలు ఇస్తుంటే.. ట్రాన్స్ లేటర్ ఇంగ్లీష్ లో చెప్పుతుంటాడు. మరి సిరాజ్ కు ఇంగ్లీష్ తెచ్చిన తిప్పలుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Virat Sharma (@ViratSharm39743) January 4, 2024