iDreamPost
android-app
ios-app

వీడియో: సంజు శాంసన్ నాటౌటా? అంపైర్ల నిర్ణయంలో తప్పేంటి? పూర్తి వివరాలు..!

  • Published May 08, 2024 | 10:03 AM Updated Updated May 08, 2024 | 10:03 AM

Sanju Samson, RR vs DC, IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అవుట్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. ఇంతకీ శాంసన్‌ అవుటా? నాటౌటా? అనే విషయాన్ని ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Sanju Samson, RR vs DC, IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అవుట్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. ఇంతకీ శాంసన్‌ అవుటా? నాటౌటా? అనే విషయాన్ని ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published May 08, 2024 | 10:03 AMUpdated May 08, 2024 | 10:03 AM
వీడియో: సంజు శాంసన్ నాటౌటా? అంపైర్ల నిర్ణయంలో తప్పేంటి? పూర్తి వివరాలు..!

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ అవుట్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. 222 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు సంజు శాంసన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో విజయం వైపు నడించాడు. కానీ, ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని స్ట్రైట్ గా భారీ షాట్ ఆడాడు శాంసన్. ఆ షాట్‌ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షై హోప్ మంచి క్యాచ్‌ అందుకున్నాడు.

కానీ, క్యాచ్‌ పట్టే టైమ్‌లో హోప్‌ బౌండరీ లైన్‌ని తొక్కినట్లు కనిపించింది. దాంతో అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ను రివ్యూ కోరారు. అయితే.. రీప్లేలో కూడా హోప్‌ బౌండరీ లైన్‌ను తొక్కుతున్నట్లు కనిపించినా.. థర్డ్‌ అంపైర్లు మాత్రం సంజు శాంసన్‌ను అవుట్‌గా ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి గురైన శాంసన్‌తో ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగారు. అంత క్లియర్‌గా బౌండరీ లైన్‌ను ఫీల్డర్‌ తాకినట్లు కనిపిస్తున్నా.. అవుట్‌ ఎలా ఇస్తారంటూ గొడవకు దిగాడు. కానీ, చివరికి చేసేదేం లేక పెవిలియన్‌ బాట పట్టాడు. నిజానికి సంజు శాంసన్‌ది నాటౌట్‌ అని మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.

అయితే… థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలైన సంజు శాంసన్‌ అవుట్‌ రాజస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఏకంగా మ్యాచ్‌నే కోల్పోయింది ఆర్‌ఆర్‌ టీమ్‌. ఈ మ్యాచ్ లో శాంసన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 86 రన్స్ చేసి.. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కానీ, థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఈ మ్యాచ్‌ అనే కాదు.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అంపైర్ల నిర్ణయాలపై వివాదాలు చెలరేగుతున్నాయి. ఇంతకు ముందు విరాట్‌ కోహ్లీ అవుట్‌ విషయంలో కూడా అంపైర్లు నో బాల్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. మరి సంజు శాంసన్‌ నాటౌట్‌ అయినా.. థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.