Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్‌.. వాంఖడే స్టేడియం వద్ద తొక్కిసలాట!

Wankhede Stadium, Victory Parade, Team India, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్‌ నిర్వహించనుంది. ఈ పరేడ్‌ కోసం వాంఖడే స్డేడియానికి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Wankhede Stadium, Victory Parade, Team India, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్‌ నిర్వహించనుంది. ఈ పరేడ్‌ కోసం వాంఖడే స్డేడియానికి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచి.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెట్‌ జట్టుకు ఘన స్వాగతం​ లభించింది. వెస్టిండీస్‌లో హరికేన్‌ తుపాను కారణంగా.. ఇండియాకు రావడం కాస్త ఆలస్యం అయినా.. వారికి లభించే ఆదరణలో మాత్రం తేడా రాలేదు. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయిన టీమిండియాకు క్రికెట్‌ అభిమానులు అదిరిపోయే వెల్‌కమ్‌ చెప్పారు. రోహిత్‌ సేన కప్పుతో తిరిగి వస్తుందని తెలియడంతో.. బుధవారం రాత్రి నుంచే వందల సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో పడిగాపులు కాశారు. ఉదయం టీమిండియా రాగానే.. వారి స్వాగతం పలికారు.

ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన టీమిండియా.. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆ తర్వాత.. ఢిల్లీ నుంచి ముంబైకి పయనమైంది. ముంబైలో టీమిండియా ఓపెన్‌ టాప్‌ బస్‌లో విక్టరీ పరేడ్‌లో పాల్గొననుంది. అయితే.. ఈ పరేడ్‌ కోసం ముంబై వాసులు ఇప్పటికే భారీగా రోడ్లపైకి వచ్చేశారు. అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా కోసం స్పెషల్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు వేల సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందని సమాచారం. భారీగా అభిమానులు రావడంతో వారిని కంట్రోల్‌ చేయడంలో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది విఫలం కావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ఫ్రీ ఎంట్రీ ఉండటంతో.. భారీగా అభిమానులు తరలివచ్చారు. కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాంఖడే వద్ద కూడా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ముంబైలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. అయినా కూడా క్రికెట్‌ అభిమానులు వర్షాన్ని లెక్క చేయకుండా టీమిండియా క్రికెటర్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. మరి వాంఖడే వద్ద తొక్కిసలాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments