iDreamPost
android-app
ios-app

ఇండియా vs ఆస్ట్రేలియా! టిక్కెట్‌ లేకుండా ఫ్రీగా స్టేడియంలో మ్యాచ్‌ చూడొచ్చు

  • Author Soma Sekhar Published - 02:35 PM, Wed - 29 November 23

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను మీరు ఫ్రీగానే స్టేడియంలో దర్జాగా కూర్చుని చూడొచ్చు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను మీరు ఫ్రీగానే స్టేడియంలో దర్జాగా కూర్చుని చూడొచ్చు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 02:35 PM, Wed - 29 November 23
ఇండియా vs ఆస్ట్రేలియా! టిక్కెట్‌ లేకుండా ఫ్రీగా స్టేడియంలో మ్యాచ్‌ చూడొచ్చు

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఏ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగినా.. అభిమానులు కిటకిటలాడుతారు. అయితే కొంత మందికి ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలని ఆశగా ఉంటుంది. కానీ వారికి ఆర్థిక స్థోమత సరిపోక తమ కోరికను అలాగే మనసులో దాచుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం వాంఖడే స్టేడియం ఓ బంపరాఫర్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను మీరు ఫ్రీగానే స్టేడియంలో దర్జాగా కూర్చుని చూడొచ్చు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదనే చేదు నిజాన్ని ఒప్పుకోక తప్పదు. టీమిండియా వుమెన్స్ క్రికెట్ కు వైభం తేవడం కోసం బీసీసీఐ పరితపిస్తూనే ఉంది. అందులో భాగంగానే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. గతంలోనే పురుషులకు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఫ్యాన్స్ కు మంచి కిక్కించే విషయం. అదేంటంటే? 2023-24 సీజన్ కు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టు, ఆసీస్ మహిళల టీమ్ ఇండియాలో పర్యటించనున్నాయి.

ఈ మ్యాచ్ లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ముందుగా ఇంగ్లాండ్ మహిళలో టీమిండియా వుమెన్స్ 3 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మూడు టీ20లకు వాంఖడే స్టేడియం వేదికగా ఉంది. డిసెంబర్ 6, 9, 10 తేదీలలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అలాగే ఆస్ట్రేలియా మహిళల టీమ్ తో ఓ టెస్టుతో పాటుగా, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే వాంఖడే వేదికగా జరిగే అన్ని మ్యాచ్ లను అభిమానులు ఫ్రీగా స్టేడియంలోకి వచ్చి చూడొచ్చని MCA అధికారులు తెలిపారు. మహిళా క్రికెట్ ను సపోర్ట్ చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ నిర్ణయంపై క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ముంబై క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.