iDreamPost
android-app
ios-app

వీడియో: ఆటగాళ్ల మధ్య గొడవ! గ్రౌండ్‌లోనే తన్నుకుంటూ రచ్చరచ్చ!

  • Published Aug 03, 2024 | 2:35 PM Updated Updated Aug 03, 2024 | 2:35 PM

France, Argentina, Football, Paris Olympics 2024: ఒలింపిక్స్‌ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఆటగాళ్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. వాళ్లు చేసిన రచ్చకు క్రీడా మైదానం రణరంగంగా మారింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

France, Argentina, Football, Paris Olympics 2024: ఒలింపిక్స్‌ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఆటగాళ్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. వాళ్లు చేసిన రచ్చకు క్రీడా మైదానం రణరంగంగా మారింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 03, 2024 | 2:35 PMUpdated Aug 03, 2024 | 2:35 PM
వీడియో: ఆటగాళ్ల మధ్య గొడవ! గ్రౌండ్‌లోనే తన్నుకుంటూ రచ్చరచ్చ!

క్రికెట్‌, ఫుట్‌బాల్‌ లాంటి ఆటల్లో ప్లేయర్ల మధ్య గొడవలు, వాగ్వాదం జరగడం కామన్‌ కానీ, గ్రౌండ్‌లోకి ఆటగాళ్లతో పాటు వేరే వ్యక్తులు కూడా దూసుకొచ్చి.. గొడవను పెద్దది చేసి గ్రౌండ్‌లో రచ్చ రచ్చ చేశారు. ఈ ఘటన జరిగింది ఏ చిన్నాచితకా మ్యాచ్‌లో కాదు.. ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పెద్ద ఫుల్‌బాల్‌ జట్ల మధ్య. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భాగంగా శుక్రవారం ఫ్రాన్స్‌, అర్జెంటీనా జట్ల మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై ఫ్రాన్స్‌ జట్టు 1-0 తేడాతో గెలిచింది.

మ్యాచ్‌ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఫ్రాన్స్‌ జట్టు.. అర్జెంటీనాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలించింది. ఇక ఫ్రాన్స్‌పై ఓటమితో అర్జెంటీనా జట్టు ఒలింపిక్స్‌ పోటీల నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది చిలికిచిలికి పెద్ద గాలివానగా మారి.. పెద్ద గొడవకు దారి తీసింది. ఫ్రాన్స్‌-అర్జెంటీనా ఫుల్‌బాల్‌ ప్లేయర్లు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అది చూసి.. కొంతమంది ప్రేక్షకులు కూడా మైదానంలోకి దూసుకొచ్చారు. గ్రౌండ్‌ అంతా గందరగోళంగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంతో ఏం అర్థం కాకుండా పోయింది.

అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది. ఎంత ఆపేందుకు ప్రయత్నించినా.. ఆటగాళ్లు ఆగలేదు. ప్రేక్షకులు కూడా గొడవలో భాగంగా కావడంతో వారిని అడ్డుకోవడం అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వల్ల కూడా కాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో తన జట్టు సెమీఫైనల్స్‌కు వెళ్లడంతో ఫ్రాన్స్‌ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. అదే సమయంలో అర్జెంటీనా కోచ్‌, ఇతర ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన సెలబ్రేషన్స్‌ చూసి తట్టుకోలేక అర్జెంటీనా ఆటగాళ్లు తమ వాగ్వాదానికి దిగారని ఫ్రాన్స్‌ కోచ్‌, కెప్టెన్‌ ఆరోపించారు. మరి ఒలింపిక్స్‌ లాంటి బిగ్‌ ఈవెంట్‌లో ఇలాంటి గొడవలు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.