iDreamPost

ఆ IPL ఫ్రాంచైజీ మాకు డబ్బులు ఎగ్గొట్టింది.. శ్రీశాంత్ సంచలన ఆరోపణలు!

IPLలో ఓ ఫ్రాంచైజీ తమకు జీతం ద్వారా రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. మరి డబ్బులు ఎగ్గొట్టిన ఆ ఫ్రాంచైజీ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPLలో ఓ ఫ్రాంచైజీ తమకు జీతం ద్వారా రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. మరి డబ్బులు ఎగ్గొట్టిన ఆ ఫ్రాంచైజీ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ IPL ఫ్రాంచైజీ మాకు డబ్బులు ఎగ్గొట్టింది.. శ్రీశాంత్ సంచలన ఆరోపణలు!

IPL.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ గా ఈ టోర్నీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతో ఈ లీగ్ లో ఆడాలని స్టార్ క్రికెటర్లతో పాటుగా యంగ్ ప్లేయర్లకు ఎంతో ఆశ. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడితే.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుంది అన్నది మనందరికి తెలిసిందే. ఒక్క సీజన్ తో ప్లేయర్లు కోటీశ్వరులు కావొచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఆటగాళ్లు ఈ లీగ్ లోకి అడుగుపెడుతుంటారు. ఇలాంటి టోర్నీలో ఓ ఫ్రాంచైజీ తమకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని సంచలన ఆరోపణలు చేశాడు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్. మరి ఆ ఫ్రాంచైజీ ఏది? ఏ ప్లేయర్లకు డబ్బులు ఇవ్వలేదు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2011 ఐపీఎల్ సీజన్ లో బరిలోకి దిగింది కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు. ఇక ఈ సీజన్ లో కొచ్చి తరఫున బరిలోకి దిగారు బ్రెండన్ మెక్ కల్లమ్, మహేళ జయవర్థనే, రవీంద్ర జడేజా, శ్రీశాంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు. అయితే వేలంలో తమకు ఇస్తామన్న డబ్బులను ఇప్పటి వరకు చెల్లించలేదని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ సీజన్ లో మాకు ఇవ్వాల్సిన జీతాన్ని కొచ్చి ఫ్రాంచైజీ ఇప్పటికీ ఇవ్వలేదని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

“కొచ్చి టస్కర్స్ కు బీసీసీఐ ఇవ్వాల్సిన డబ్బులను ఎప్పుడో ఇచ్చేసింది. కానీ కొచ్చి ఫ్రాంచైజీ మాత్రం మా బకాయిలను ఇంత వరకు చెల్లించలేదు. మా పిల్లల పెళ్లిళ్ళ వరకైనా ఆ డబ్బులు మాకు వస్తాయని అనుకుంటున్నాము. అయితే మా డబ్బులు ఇచ్చేటప్పుడు సంవత్సరానికి 18 శాతం వడ్డీని గుర్తు పెట్టుకోండి” అని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీశాంత్. అతడితో పాటుగా మెక్ కల్లమ్, జడేజా, జయవర్థనే లకు కూడా జీతాలు ఇవ్వలేదని పేర్కొన్నాడు. కాగా.. 3 సంవత్సరాలు లీగ్ లో కొనసాగాల్సిన కొచ్చి.. ఐపీఎల్ లో నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా తొలి సీజన్ కే నిషేధించబడింది. మరి ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్ లో ఓ ఫ్రాంచైజీ జీతాలు ఎగ్గొట్టిందని ఆరోపణలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి