iDreamPost
android-app
ios-app

ఆ సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన యువరాజ్ సింగ్! ఎందుకంటే?

తనను మోసగించాయి అని మూడు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తనను మోసగించాయి అని మూడు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన యువరాజ్ సింగ్! ఎందుకంటే?

టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తాజాగా వార్తల్లో నిలిచాడు. తనను మూడు వేర్వేరు సంస్థలు మోసగించాయి అని లీగల్ నోటీసులు పంపాడు యువీ. ప్రస్తుతం ఈ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి యువరాజ్ ను మోసగించిన ఆ కంపెనీలు ఏవి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీకి చెందిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేర్వేరుగా రెండు లీగల్ నోటీలు జారీ చేశాడు. అసలు విషయం ఏంటంటే? 2020లో ఢిల్లీకి చెందిన రెండు హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఓ అపార్ట్ మెంట్ ను బుక్ చేసుకున్నాడు. అయితే ఆ అపార్ట్ మెంట్ ను యువీకి చెప్పిన సమయంలో అప్పగించలేదు. పైగా అందుకు సరైన కారణాలను కూడా వెల్లడించలేదు. అంతేకాకుండా.. నాసిరకంగా కట్టిన ఇంటిని అప్పగించారని తాను జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నాడు. నాణ్యతతో కూడిన ఫ్లాట్ ను అందించాలని యువరాజ్ సింగ్ డిమాండ్ చేశాడు.

ఇక దీనితో పాటుగా ఓ నిర్మాణ సంస్థ.. ఓ ప్రాజెక్ట్ లో భాగంగా తనతో చేసిన ప్రకటన విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు సదరు సంస్థకు నోటీసు పంపించాడు యువీ. ఆ సంస్థకు ప్రచారానికి సంబంధించి 2023లోనే ఒప్పందం ముగిసినప్పటికీ.. ఇంకా తన పేరును ఉపయోగించుకుంటోందని ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు జారీ చేశాడు. అగ్రిమెంట్ ముగిసినా.. తన పేరును ఉపయోగించుకోవడం, తన హక్కుకు భంగం కలిగించడమే అంటూ అందులో పేర్కొన్నాడు యువీ. మరి యువరాజ్ పంపిన ఈ నోటీసులపై ఆ సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి