iDreamPost
android-app
ios-app

తాగొచ్చి అంపైరింగ్‌ చేస్తున్నారు! డోపింగ్‌ టెస్ట్‌ పెట్టండి: భారత క్రికెటర్‌

  • Published Feb 21, 2024 | 2:44 PM Updated Updated Feb 21, 2024 | 2:44 PM

ఆటగాళ్లకు నిర్వహించే డోప్ టెస్టులు అంపైర్లకు కూడా పెట్టాలని సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్. మ్యాచ్ లకు తాగొచ్చి అంపైరింగ్ చేస్తున్నారని అతడు ఆరోపించాడు.

ఆటగాళ్లకు నిర్వహించే డోప్ టెస్టులు అంపైర్లకు కూడా పెట్టాలని సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్. మ్యాచ్ లకు తాగొచ్చి అంపైరింగ్ చేస్తున్నారని అతడు ఆరోపించాడు.

తాగొచ్చి అంపైరింగ్‌ చేస్తున్నారు! డోపింగ్‌ టెస్ట్‌ పెట్టండి: భారత క్రికెటర్‌

సాధారణంగా ఏ క్రీడల్లో అయినా క్రీడాకారులకు డోపింగ్ టెస్ట్ పెడుతూ ఉంటారు. ప్లేయర్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు నిర్థారణ అయితే.. వారికి తగిన శిక్ష విధిస్తారు. కొన్ని మ్యాచ్ ల నిషేధం కూడా డోప్ టెస్ట్ లో పట్టుబడిన ఆటగాళ్లు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఈ డోప్ టెస్ట్ లను ఆటగాళ్లతో పాటుగా అంపైర్లకు కూడా నిర్వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది అంపైర్లు మ్యాచ్ జరుగుతున్న క్రమంలో నిద్రపోవడం చూశానని చెప్పుకొచ్చాడు ఈ క్రికెటర్.

మనోజ్ తివారీ.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ బెంగాల్ ప్లేయర్.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై సంచలన ఆరోపణలు చేశాడు. ధోని వల్లే తన కెరీర్ నాశనం అయ్యిందని, అతడు కారణంగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థాయిలో ఉండాల్సిన నేను ఈ రోజు క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చిందని హాట్ కామెంట్స్ చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్ తివారీపై బూతులతో రెచ్చిపోయారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

మనోజ్ తివారీ మాట్లాడుతూ..”ఆటగాళ్లకు ఎలాగైతే డోప్ టెస్ట్ లు నిర్వహిస్తారో.. అలాగే మ్యాచ్ కు ముందు డొమెస్టిక్ క్రికెట్ లో అంపైర్లకు కూడా డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి. నేను చాలాసార్లు మ్యాచ్ ఆడుతున్నప్పుడు అంపైర్లు నిద్రపోవడం చూశాను. వారిని అడిగాను కూడా. మీరు రాత్రి ఏ డ్రింక్ తాగారని. దానికి ఆ అంపైర్ గట్టిగా నవ్వి.. విస్కీ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పటికైనా బీసీసీఐ కళ్లు తెరవాలి. టోర్నీ ప్రారంభానికి ముందే అంపైర్లను ఓ కంటకనిపెడుతూ ఉండాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మనోజ్ తివారీ. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు ఈ మాజీ ప్లేయర్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ లో చర్చనీయాంశంగా మారాయి. మరి మనోజ్ తివారీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కొడుకు విషయంలో కోహ్లీ ఇంత భయపడ్డాడా? ఏమి జరిగిందంటే?