iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: పుట్టుకతోనే ఆ స్కిల్ బుమ్రా సొంతం.. అందుకే వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు: టీమిండియా మాజీ కోచ్

  • Published Aug 12, 2024 | 8:55 AM Updated Updated Aug 12, 2024 | 8:55 AM

టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు పుట్టుకతోనే ఆ స్కిల్స్ వచ్చాయని, అతడి సక్సెస్ కు, వరల్డ్ క్లాస్ బౌలర్ గా ఎదగడానికి అదే కారణం అని చెప్పుకొచ్చాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. ఈ సందర్భంగా బుమ్రాపై మాజీ కోచ్ ప్రశంసలు కురిపించాడు.

టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు పుట్టుకతోనే ఆ స్కిల్స్ వచ్చాయని, అతడి సక్సెస్ కు, వరల్డ్ క్లాస్ బౌలర్ గా ఎదగడానికి అదే కారణం అని చెప్పుకొచ్చాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. ఈ సందర్భంగా బుమ్రాపై మాజీ కోచ్ ప్రశంసలు కురిపించాడు.

Jasprit Bumrah: పుట్టుకతోనే ఆ స్కిల్ బుమ్రా సొంతం.. అందుకే వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు: టీమిండియా మాజీ కోచ్

వరల్డ్ క్రికెట్ లో ఎంతో మంది వైవిధ్యమైన బౌలర్లు ఉన్నారు. కానీ వారందరిలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది విభిన్న శైలి. ఇక యార్కర్లు సంధించడంలో బుమ్రా సిద్ధహస్తుడు అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే అభిమానులు ముద్దుగా యార్కర్ల కింగ్ ని పిలుచుకుంటారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 భారత్ గెలుచుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. కాగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. పుట్టుకతోనే అతడికి ఆ స్కిల్స్ వచ్చాయని పొగిడాడు.

టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇతర బౌలర్లతో పోల్చితే బుమ్రాతో చాలా నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఓ నేషనల్ ఛానల్ తో మాంబ్రే మాట్లాడుతూ..”ప్రపంచ బౌలర్లలో బుమ్రా బౌలింగ్ శైలి భిన్నం. ఇతర బౌలర్ల కంటే 20 సెంటిమీటర్ల ముందుగానే ఇతడు బాల్ ను రిలీజ్ చేస్తాడు. ఈ గ్యాప్ అతడికి ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే బుమ్రాను ఫ్రీక్ బౌలర్  అంటారు. ఈ స్కిల్ అతడికి పుట్టుకతోనే వచ్చింది. ఇతర బౌలర్ల కంటే భిన్నంగా  కేవలం నాలుగు అడుగుల రన్నప్ తోనే అద్భుతమైన స్వింగ్, వేగం రాబట్టగలడు బుమ్రా” అంటూ ప్రశంసించాడు భారత మాజీ కోచ్.

bumrah bowling skills

బుమ్రా పిచ్ పరిస్థితులను అర్ధం చేసుకుని, బ్యాట్స్ మెన్స్ ఆడే షాట్లకు తగ్గట్లుగా బంతులు సంధిస్తాడని మాంబ్రే చెప్పుకొచ్చాడు. పుట్టుకతోనే ఇన్ని స్కిల్స్ సొంతం చేసుకున్నాడు కాబట్టే.. అతడు వరల్డ్ క్లాస్ బౌలర్ గా నిలిచాడని పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు ఈ యార్కర్ల కింగ్. ఇదిలా ఉండగా.. ఈ వరల్డ్ కప్ విజయం తర్వాత బౌలింగ్ కోచ్ పదవి నుంచి పరాస్ మాంబ్రే తప్పుకున్న విషయం తెలిసిందే. మరి బుమ్రా బౌలింగ్ స్కిల్స్ పై మాజీ కోచ్ ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేేయండి.