శ్రీలంకపై భారీ విజయం సాధించడంతో టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ హసన్ రజా. ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అవుతున్న పాక్ జట్టును తిట్టలేక.. తమ అక్కసును భారత్ పై వెళ్లగక్కుతున్నాడు.
శ్రీలంకపై భారీ విజయం సాధించడంతో టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ హసన్ రజా. ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అవుతున్న పాక్ జట్టును తిట్టలేక.. తమ అక్కసును భారత్ పై వెళ్లగక్కుతున్నాడు.
ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో భారత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ కొందరికి మాత్రం కడుపు మంటగా ఉంది. భారత జట్టు సాధిస్తున్న విజయాలు చూసి కుళ్లుకుంటోంది ఓ దేశం. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈపాటికే అర్ధమైంది అనుకుంటా. అవును టీమిండియా విజయాలను చూసి పాకిస్తాన్ కు కడుపు మంటగా ఉంది. దీంతో టీమిండియాపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ.. పరువుపోగొట్టుకుంటున్నారు కొందరు పాక్ మాజీ క్రికెటర్లు. తాజాగా శ్రీలంకపై భారీ విజయం సాధించడంతో టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ హసన్ రజా. ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అవుతున్న పాక్ జట్టును తిట్టలేక.. తమ అక్కసును టీమిండియాపై వెళ్లగక్కుతున్నారు.
‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు’.. ఈ సామెత అచ్చంగా ఇప్పుడు పాకిస్తాన్ కు సరిపోతుంది. ఎందుకంటే.. ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అవుతున్న తమ జట్టును విమర్శించకుండా.. ఇతర దేశాలను మరీ ముఖ్యంగా టీమిండియాపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు కొందరు పాక్ మాజీ క్రికెటర్లు. తాజాగా శ్రీలంకపై భారత్ సాధించిన అద్భుత విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టీమిండియాపై లేనిపోని నిందలు వేస్తూ.. ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రపంచ కప్ లో భారత జట్టు సాధిస్తున్న వరుస విజయాలపై పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ..”వరల్డ్ కప్ లో మిగతా జట్ల బౌలర్ల కంటే.. భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోంది. బహుశా బీసీసీఐ, ఐసీసీ వారికి ప్రత్యేక బాల్స్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే భారత బౌలర్లు బ్యాటింగ్ పిచ్ పైనా వికెట్లు తీస్తున్నారు. దీనితో పాటుగా డీఆర్ఎస్ కూడా వారికి అనుకూలంగా వస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలి” అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడు హసన్ రజా. ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియాపై మీకెందుకు ఇంత కుళ్లు అని ఏకిపారేస్తున్నారు భారత అభిమానులు. ఇంత కడుపు మంట మంచిది కాదు.. మీరిక మారరా? ముందు మీ జట్టు దారుణ వైఫల్యాల గురించి ఆలోచించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఐసీసీ నిబంధనలు తెలీవు అనుకుంటా.. ఒకసారి చదువుకోండి అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ICC Might Give Different Ball to Indian Bowlers thats why they are Getting Seam and Swing More Than Others.Ex Test Cricketer Hasan Raza.#CWC23 #INDvSL pic.twitter.com/7KCQoaz0Qs
— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 2, 2023