iDreamPost
android-app
ios-app

Rinku Singh: టీ20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్ కు నో ఛాన్స్.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!

  • Published Jan 11, 2024 | 3:21 PM Updated Updated Jan 11, 2024 | 3:21 PM

టీమిండియా మాజీ ప్లేయర్ దీప్ దాస్ గుప్తా సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ లో రింకూ సింగ్ కు స్థానం ఉండకపోవచ్చని బాంబ్ పేల్చాడు. దానికి కొన్ని రీజన్స్ కూడా అతడు వెళ్లడించాడు.

టీమిండియా మాజీ ప్లేయర్ దీప్ దాస్ గుప్తా సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ లో రింకూ సింగ్ కు స్థానం ఉండకపోవచ్చని బాంబ్ పేల్చాడు. దానికి కొన్ని రీజన్స్ కూడా అతడు వెళ్లడించాడు.

Rinku Singh: టీ20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్ కు నో ఛాన్స్.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!

వరల్డ్ కప్ 2023 గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా.. ఆ లోటును పూడ్చుకోవడానికి టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడాలని భావిస్తోంది. అందుకోసం ఎప్పటి నుంచో జట్టులో ప్రయోగాలు చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది. ఇక టీమిండియాలో రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం అందరి చూపు టీ20 వరల్డ్ కప్ తో పాటు, ఆ టోర్నీకి ఎవరు ఎంపిక అవుతారు? అన్న దానిపైనే ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ దీప్ దాస్ గుప్తా సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ లో రింకూ సింగ్ కు స్థానం ఉండకపోవచ్చని బాంబ్ పేల్చాడు. దానికి కొన్ని కారణాలు కూడా అతడు వెళ్లడించాడు.

రింకూ సింగ్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో రింకూ పేరు మారుమ్రోగిపోతోంది. 2023 ఐపీఎల్ సీజన్ లో ఒకే ఒక్క మ్యాచ్ లో చేసిన థండర్ బ్యాటింగ్ వల్ల వెలుగులోకి వచ్చాడు ఈ చిచ్చరపిడుగు. తనదైన ఫినిషింగ్ బ్యాటింగ్ తో భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. తొలుత టీ20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ సంచలనం. అతడి ప్రస్తుత ఫామ్ చూస్తే .. త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి కచ్చితంగా జట్టులో ఉంటాడని అందరూ భావిస్తున్నారు. కానీ అతడు ఈ మెగాటోర్నీకి ఉండటం అనుమానంగానే ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ దీప్ దాస్ గుప్తా.

“వచ్చే పొట్టి వరల్డ్ కప్ కు రింకూ సింగ్ కు జట్టులో ప్లేస్ దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే? సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు జట్టులోకి వస్తే.. రింకూ, తిలక్ వర్మల స్థానాలు గల్లంతు అవుతాయి. అదీకాక రోహిత్, విరాట్ లు కూడా జట్టులో చేరారు. దీంతో వీరిద్దరి స్థానాలకు ఎసరొచ్చినట్లే. అదీకాక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఎటు చూసినా రింకూ కు టీ20 వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువే” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి పెద్ద బాంబ్ పేల్చాడు దీప్ దాస్ గుప్తా.

అయితే  ఈ మాజీ క్రికెటర్ చెప్పిన ప్రకారం చూస్తే.. ఇది నిజమనే అనిపిస్తోంది. కానీ టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవాలంటే కచ్చితంగా రింకూ లాంటి ఫినిషర్ ఉండాలని మేనేజ్ మెంట్ తో పాటుగా అభిమానులు భావిస్తున్నారు. టీమిండియాలో ఫినిషర్ పాత్ర ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ ను భర్తీ చేయగల ఒకే ఒక్క ఆటగాడు రింకూ సింగ్ అని అందరూ భావిస్తున్నారు. మరి రింకూ సింగ్ పై మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.