Vikram Rathour: న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్!

Vikram Rathour appointed New Zealand batting coach: ఆఫ్గానిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ ను నియమించుకుంది.

Vikram Rathour appointed New Zealand batting coach: ఆఫ్గానిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ ను నియమించుకుంది.

టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ టీమ్ భారత్ గడ్డపై అడుగుపెట్టింది. కివీస్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది భారత్. అయితే అంతకు ముందే కివీస్-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నోయిడా వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దాని కోసం ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాయి. కాగా.. ఈ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లను నియమించుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్ ను నియమిస్తున్నట్లు బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆఫ్గానిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ సిద్ధం అవుతోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ను స్టార్ట్ చేశాయి.  అయితే.. ఈ మ్యాచ్ కు ముందు కివీస్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్గానిస్తాన్, భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు తమ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ రంగనా హెరాత్ ను నియమించుకుంది. అలాగే ఆఫ్గాన్ తో జరిగే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కోసం బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్ ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ రేమండ్ స్టెడ్ కూడా ధృవీకరించాడు. రంగనా హెరాత్, విక్రమ్ రాథోర్ లు తమ జట్టులో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు.

కాగా.. టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకున్న టీమిండియా జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోర్ పనిచేసిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో పాటుగా రాథోర్ ది కూడా ముగిసింది. కానీ.. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేదు. దాంతో న్యూజిలాండ్ కు బ్యాటింగ్ కోచ్ గా తన సేవలను అందించనున్నాడు ఈ మాజీ ఓపెనర్. కాగా.. విక్రమ్ రాథోర్ టీమిండియా తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మరి భారత మాజీ ఓపెనర్ కివీస్ కు బ్యాటింగ్ కోచ్ గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments