iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ బ్యాట్‌ కంటే.. అధిక ధర పలికిన కోహ్లీ గ్లౌజ్‌లు!

  • Published Aug 24, 2024 | 11:45 AM Updated Updated Aug 24, 2024 | 11:45 AM

Virat Kohli, KL Rahul, Athiya Shetty, Cricket for a Cause: టీమిండియా స్టార్‌ క్రికెట్‌ కేఎల్‌ రాహుల్‌ తన భార్య అతియా శెట్టి నిర్వహించిన క్రికెటర్ల వస్తువుల వేలంలో కోహ్లీ జెర్సీ అధిక ధర పలికింది. మరి మిగతా క్రికెటర్ల వస్తువులు ఎంత ధర పలికాయో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, KL Rahul, Athiya Shetty, Cricket for a Cause: టీమిండియా స్టార్‌ క్రికెట్‌ కేఎల్‌ రాహుల్‌ తన భార్య అతియా శెట్టి నిర్వహించిన క్రికెటర్ల వస్తువుల వేలంలో కోహ్లీ జెర్సీ అధిక ధర పలికింది. మరి మిగతా క్రికెటర్ల వస్తువులు ఎంత ధర పలికాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 24, 2024 | 11:45 AMUpdated Aug 24, 2024 | 11:45 AM
రోహిత్‌ శర్మ బ్యాట్‌ కంటే.. అధిక ధర పలికిన కోహ్లీ గ్లౌజ్‌లు!

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఉన్నాడు. తాజాగా కోహ్లీ క్రేజ్‌కు కొలమానంగా నిలిచే మరో సంఘటన చోటు చేసుకుంది. ఒక నోబుల్‌ కాజ్‌తో టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, అతని భార్య, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి కలిసి వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు క్రికెటర్ల వస్తువులను సేకరించి.. వాటిని వేలం వేశారు. ఆ వేలం ద్వారా వచ్చిన నిధులను విప్లా అనే ఫౌండేషన్‌కు అందించనున్నారు. ఈ ఫౌండేషన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఒక స్కూల్‌ను నడుపుతోంది.

శుక్రవారం జరిగిన ఈ వేలంలో కోహ్లీ జెర్సీ, గ్లోవ్స్ అధిక ధర పలికాయి. కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు పలకగా.. గ్లోవ్స్ రూ. 28 లక్షలకు అమ్ముడయ్యాయి. టీమిండియా వన్డే టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ బ్యాట్ రూ.24 లక్షలు, ధోనీ బ్యాట్ రూ.13 లక్షలు, ద్రవిడ్ బ్యాట్ రూ.11 లక్షలు పలికాయి. ఈ వేలం ద్వారా రాహుల్-అతియా దంపతులు మొత్తం రూ.1.93 కోట్లు సేకరించారు. ఈ మొత్తాన్ని విప్లా ఫౌండేషన్‌కు అందిస్తారు. ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం.. టీమిండియా క్రికెటర్లు కోహ్లీ, రోహత్‌, అశ్విన్‌, జడేజా, బుమ్రాతో పాటు మరికొంత మంది తన వస్తువులను ఫ్రీగా డొనేట్‌ చేశారు. మరి ఎవరి వస్తువు ఎంత ధర పలికిందో ఇప్పుడు చూద్దాం..

  • రాహుల్‌ ద్రవిడ్‌ బ్యాట్‌(ప్లేయర్‌గా లాస్ట్‌ వన్డే సిరీస్‌లో వాడింది) – రూ.11 లక్షలు
  • జస్ప్రీత్‌ బుమ్రా జెర్సీ(2023 వన్డే వరల్డ్‌ కప్‌) – రూ.8 లక్షలు
  • క్వింటన్‌ డికాక్‌ వికెట్‌ కీపింగ్‌ గ్లౌజులు(ఐపీఎల్‌ 2024లో వాడినవి) – రూ.1.10 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ జెర్సీ(2023 వన్డే వరల్డ్‌ కప్‌) – రూ.3.80 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ టీమిండియా క్యాప్‌ – రూ.2.20 లక్షలు
  • సంజు శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ(ఐపీఎల్‌ 2024లో వాడింది) – రూ.50 వేలు
  • నికోలస్‌ పూరన్‌ లక్నో జెర్సీ(ఐపీఎల్‌ 2024లో వాడింది) – రూ.45 వేలు
  • రోహిత్‌ శర్మ బ్యాట్‌ – రూ.24 లక్షలు
  • రోహిత్‌ శర్మ గ్లౌజ్‌లు – రూ.7.50 లక్షలు
  • యుజ్వేంద్ర చాహల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ(ఐపీఎల్‌ 2024) – రూ.50 వేలు
  • మహేంద్ర సింగ్‌ ధోని బ్యాట్‌(ఐపీఎల్‌ 2024లో వాడింది) – రూ.13 లక్షలు
  • ధోని గ్లౌజ్‌లు(ఐపీఎల్‌ 2024లో వాడనివి) – రూ.3.50 లక్షలు
  • జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ(ఐపీఎల్‌ 2024) – రూ.55 వేలు
  • కేఎల్‌ రాహుల్‌ బ్యాట్‌(వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడింది) – రూ.7 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ గ్లౌజ్‌లు(వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడనవి) – రూ.1.60 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ టెస్ట్‌ జెర్సీ(2024 ఇంగ్లండ్‌ టూర్‌లో వాడింది) – రూ.11 లక్షలు
  • విరాట్‌ కోహ్లీ జెర్సీ(2019 వన్డే వరల్డ్‌ కప్‌లో వాడింది) – రూ.40 లక్షలు
  • విరాట్‌ కోహ్లీ గ్లౌజ్‌లు(2019 వన్డే వరల్డ్‌ కప్‌లో వాడినవి) – రూ.28 లక్షలు
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాళ్లు సైన్‌ చేసిన బ్యాట్‌ – రూ.2.80 లక్షలు
  • రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్ట్‌ జెర్సీ(2024 ఇంగ్లండ్‌ టూర్‌లో వాడింది) – రూ.4.20 లక్షలు
  • రిషభ్‌ పంత్‌ బ్యాట్‌(ఐపీఎల్‌ 2021లో వాడింది) – రూ.7 లక్షలు
  • రిషభ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ గ్లౌజ్‌లు(ఐపీఎల్‌ 2021లో వాడినవి)- రూ.3.80 లక్షలు
  • శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌(2022 సౌతాఫ్రికా టూర్‌లో వాడింది) – రూ.2.80 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ప్యాడ్స్‌(వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడినవి) – రూ.2.40 లక్షలు
  • రవీంద్ర జడేజా సీఎస్‌కే జెర్సీ(ఐపీఎల్‌ 2024లో వాడింది) – రూ.2.40 లక్షలు
  • కేఎల్‌ రాహుల్‌ హెల్మెట్‌(వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాడింది)- రూ.4.20 లక్షలు