iDreamPost
android-app
ios-app

Michael Vaughan: టీమిండియాపై నోరుపారేసుకున్న మైఖేల్ వాన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

  • Published Dec 30, 2023 | 12:52 PM Updated Updated Dec 30, 2023 | 12:52 PM

తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ లో ఓడిపోయిన తర్వాత భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.

తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ లో ఓడిపోయిన తర్వాత భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.

Michael Vaughan: టీమిండియాపై నోరుపారేసుకున్న మైఖేల్ వాన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంది టీమిండియా. కానీ తొలి టెస్ట్ లోనే భారత్ కు షాకిచ్చారు సఫారీ బౌలర్లు. సంచలన బౌలింగ్ తో టీమిండియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఇక ఇదే అదునుగా భావించిన కొందరు మాజీ క్రికెటర్లు టీమిండియాపై నోరుపారేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. భారత జట్టుపై మాటల యుద్దం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ లో ఓడిపోయిన తర్వాత భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ వాన్ కాస్త పొగరు తగ్గించుకో అంటూ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు.

గత కొంత కాలంగా టీమిండియా ఏ మేజర్ టోర్నీని కూడా గెలవలేదు. సాధారణ సిరీసుల్లో సత్తాచాటుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లోకి వచ్చేసరికి బోల్తాకొడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. “గత పది సంవత్సరాలుగా టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఇకపై గెలుస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ట్రోఫీలు మాత్రం గెలవలేకపోతోంది. భారత జట్టులో ఉన్న ప్రతిభతో ఎన్నో టైటిల్స్ సాధించాలి. కానీ అది జరగడం లేదు.. వారు ఇతర సిరీస్ లు గెలుస్తున్నారు తప్పితే ఐసీసీ లాంటి మెగాటోర్నీలను గెలవలేకపోతున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

టీమిండియాలో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నప్పటికీ.. వారి స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయడం లేదని, అందుకే భారత్ 2013 తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేదని గుర్తుచేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ వాన్ పై ఫైర్ అవుతున్నారు. మైఖేల్ వాన్ మీ ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి ముందు చూసుకో.. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో పసికూనల చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయావా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కాగా.. భారత జట్టు చివరిగా గెలిచిన ఐసీసీ ట్రోఫీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఒక్కటి కూడా ఐసీసీ ఈవెంట్ గెలవలేదు. మరి టీమిండియాపై మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.