iDreamPost
android-app
ios-app

హార్దిక్ కెప్టెన్సీ దారుణం.. ఒక్కరికి కూడా గెలవాలన్న కసి లేదు: వెంకటేశ్ ప్రసాద్

  • Author Soma Sekhar Published - 08:36 PM, Mon - 7 August 23
  • Author Soma Sekhar Published - 08:36 PM, Mon - 7 August 23
హార్దిక్ కెప్టెన్సీ దారుణం.. ఒక్కరికి కూడా గెలవాలన్న కసి లేదు: వెంకటేశ్ ప్రసాద్

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగిస్తోంది. టెస్టు, వన్డే సిరీస్ లను గెలుచుకుని మంచి ఊపుమీద ఉన్న భారత జట్టుకు టీ20 సిరీస్ లో గట్టి షాక్ ఇస్తోంది విండీస్ టీమ్. ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గి ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఇక ఘోర ప్రదర్శన చేస్తున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాలో ఏ ఒక్క ఆటగాడికి కూడా గెలవాలన్న కసి లేదని మండిపడ్డాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.

వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. రెండో టీ20 మ్యాచ్ లో సైతం విండీస్ పై ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ టీమిండియా ప్లేయర్లపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. ట్విట్టర్ వేదికగా హార్దిక్ కెప్టెన్సీ పై, టీమిండియా ఆటగాళ్లపై మండిపడ్డాడు. మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ దారుణంగా ఉందన్నాడు. అతడు బౌలర్లను ఉపయోగించిన తీరు అస్సలు బాలేదని మండిపడ్డాడు. రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు సాధారణంగా ఆడిందని, జట్టులో ఒక్కరికి కూడా గెలవాలన్న కసిలేదని ఎద్దేవ చేశాడు.

కాగా.. 2007 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్ ప్రారంభం అయ్యిందని, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 టీ20 వరల్డ్ కప్ లు జరిగితే.. టీమిండియా ఒక్క టైటిల్ కూడా గెలవలేదని గుర్తు చేశాడు వెంకటేశ్ ప్రసాద్. ఇక ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్ కు పూర్తి ఓవర్ల కోటా ఇవ్వకపోవడం ఘోర తప్పిదమని మండిపడ్డాడు. టీమిండియాకు ఆడుతున్న కుర్రాళ్లలో గెలవాలనే కసి ఉండటం ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మరి వెంకటేశ్ ప్రసాద్ టీమిండియా ఆటగాళ్లపై అలాగే హార్దిక్ కెప్టెన్సీ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: వరల్డ్ కప్ లో భారత్ ని కట్టడి చేసేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్!