iDreamPost

వరల్డ్ కప్ లో భారత్ ని కట్టడి చేసేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్!

  • Author Soma Sekhar Published - 07:34 PM, Mon - 7 August 23
  • Author Soma Sekhar Published - 07:34 PM, Mon - 7 August 23
వరల్డ్ కప్ లో భారత్ ని కట్టడి చేసేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్!

2023 వరల్డ్ కప్ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ విశ్వ సమరానికి సై అంటూ ప్రణాళికలు రచిస్తున్నాయి అన్ని జట్లు. ఇప్పటికే కొన్ని దేశాలు తమ వరల్డ్ కప్ జట్లను ప్రకటిస్తూ.. వస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఈ మెగా టోర్నీ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసింది. ఇక ఈ జట్టులో సీనియర్ బ్యాటర్ లబూషేన్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే టీమిండియాను కట్టడి చేయడం కోసం ఆసీస్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే.. భారత సంతతికి చెందిన స్పిన్నర్ ను జట్టులోకి తీసుకుంది.

వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరెట్ జట్టు ఏది అంటే ఎక్కువ మంది క్రీడా పండితులతో పాటుగా.. క్రికెట్ దిగ్గజాలు చెప్పే ఒకే ఒక్క జట్టు పేరు టీమిండియా. మరో రెండు నెలల్లో భారత్ వేదికగా విశ్వ సమరానికి తెరలేవనుంది. అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నాయి ప్రపంచ జట్లు. ఈ నేపథ్యంలోనే తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా టీమ్. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు ఆసీస్ టీమ్.. సౌతాఫ్రికా, భారత్ లతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఈ రెండు వన్డే సిరీస్ లతో పాటుగా వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా.

అయితే ఈసారి పక్కా ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ఆటగాళ్లను తొలిసారిగా ఎంపిక చేసింది. వారిలో ఒకరు ఆల్ రౌండర్ ఆరోన్ హోర్డీ కాగా.. ఇంకో ఆటగాడు భారత సంతతికి చెందిన యువ స్పిన్నర్ తన్వీర్ సంగా. గత కొద్ది కాలంగా వీరిద్దరు దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన తన్వీర్ సంగా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. 2020-21 సీజన్ బిగ్ బాష్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు తన్వీర్.

కాగా.. 2021లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టి 8 మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీసుకున్నాడు. కుడిచేతి స్పిన్నర్ అయిన తన్వీర్ లెగ్ బ్రేక్ వేస్తాడు. దాంతో భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో తన్వీర్ కీలకంగా మారుతాడని ఆసీస్ భావిస్తోంది. ఇక భారత్ లోని పరిస్థితులు అతడికి చక్కగా సరిపోతాయని పక్కా ప్లాన్ తోనే అతడిని ఎంపిక చేసినట్లుగానే తెలుస్తోంది. భారత్ ను కట్టడి చేయాలంటే వైవిధ్యం కలిగిన బౌలర్ తన్వీర్ అని భావిస్తోంది ఆసీస్. మరి వరల్డ్ కప్ లో భారత్ ను కట్టడి చేయడంలో భాగంగానే తన్వీర్ సంగాను ఆసీస్ ఎంపిక చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా కివీస్ లెజెండ్! కావ్య పాప మాస్టర్ ప్లాన్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి