iDreamPost
android-app
ios-app

Mayank Yadav: ప్రమాదంలో మయాంక్ కెరీర్.. BCCIని హెచ్చరించిన ఆసీస్ దిగ్గజం!

  • Published Apr 06, 2024 | 9:07 PM Updated Updated Apr 06, 2024 | 9:07 PM

నయా సంచలనం మయాంక్ యాదవ్ కెరీర్ ప్రమాదంలో పడబోతోందని బీసీసీఐని హెచ్చరించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్. ఆ వివరాల్లోకి వెళితే..

నయా సంచలనం మయాంక్ యాదవ్ కెరీర్ ప్రమాదంలో పడబోతోందని బీసీసీఐని హెచ్చరించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్. ఆ వివరాల్లోకి వెళితే..

Mayank Yadav: ప్రమాదంలో మయాంక్ కెరీర్.. BCCIని హెచ్చరించిన ఆసీస్ దిగ్గజం!

ఐపీఎల్ 2024 సీజన్ లో ఓ కుర్ర బౌలర్ పేరు మారుమోగిపోతోంది. తన వేగంతో వరల్డ్ క్లాస్ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఈ పేసర్. ఆడింది రెండంటే రెండు మ్యాచ్ లే అయినప్పటికీ.. పేరు మాత్రం వంద మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ కు వచ్చినంత వచ్చింది. అతడే మయాంక్ యాదవ్. బుల్లెట్ వేగంతో బంతులు సంధిస్తూ.. బ్యాటర్ల పాలిట ఈ సీజన్ లో సింహస్వప్నంలా మారాడు మయాంక్. ఇక ఇతడి స్పీడ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ బౌలర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ స్పీడ్ స్టర్ భవిష్యత్ ప్రమాదంలో పడబోతోందని బీసీసీఐని హెచ్చరించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్. మరి ఈ స్టార్ ప్లేయర్ ఇలా హెచ్చరించడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మయాంక్ యాదవ్.. సూపర్ స్పీడ్ తో ప్రపంచాన్ని మెుత్తం తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. ఇతడి పేస్ బౌలింగ్ ధాటికి హేమాహేమి బ్యాటర్లే తోకముడవాల్సిన పరిస్థితి. నిలకడగా 155 కిలోమీటర్ల స్పీడ్ తో బంతులు వేస్తూ.. బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. దీంతో త్వరలోనే టీమిండియాలోకి మయాంక్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని క్రీడా పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అతడి కెరీర్ ప్రమాదంలో పడబోతోందని హెచ్చరించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్. ఈ విషయంలో బీసీసీఐకి కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు.

షేన్ వాట్సన్ మాట్లాడుతూ..”వరల్డ్ క్లాస్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించడం చాలా పెద్ద విషయం. ఇక మయాంక్ టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడొచ్చు. కానీ బీసీసీఐ మాత్రం ఇప్పుడే అతడిని టెస్ట్ ఫార్మాట్ కు ఎంపిక చేయెుద్దు. ఎందుకంటే? అతడి శరీరం ఇంకా టెస్ట్ లకు సిద్ధం కాలేదు. పైగా 150 కిలోమీటర్ల స్పీడ్ తో రోజు మెుత్తంలో 15 నుంచి 20 ఓవర్లు వేయడం అంటే మాటలు కాదు. అందుకే అతడిని ఇప్పుడే టెస్ట్ లకు ఎంపిక చేయడం మంచిది కాదు. ఈ పాయింట్ ను బీసీసీఐ కూడా ఆలోచనలోకి తీసుకుంటుందని అనుకుంటున్నాను” అని చెప్పాడు వాట్సన్. కాగా.. ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇది దృష్టిలో పెట్టుకునే వాట్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.