iDreamPost

MI vs DC: ఓటముల్లో ఉన్నా ముంబై ఇండియన్స్ గొప్ప మనసు.. రేపటి మ్యాచ్ కు..

ఐపీఎల్ లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 7) జరగనున్న ఢిల్లీ-ముంబై మ్యాచ్ కి ఓ ప్రత్యేకత ఉంది. వరుస ఓటముల్లో ఉన్నాగానీ తన గొప్ప మనసును చాటుకుంది ముంబై ఇండియన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 7) జరగనున్న ఢిల్లీ-ముంబై మ్యాచ్ కి ఓ ప్రత్యేకత ఉంది. వరుస ఓటముల్లో ఉన్నాగానీ తన గొప్ప మనసును చాటుకుంది ముంబై ఇండియన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

MI vs DC: ఓటముల్లో ఉన్నా ముంబై ఇండియన్స్ గొప్ప మనసు.. రేపటి మ్యాచ్ కు..

ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నాగానీ.. హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక ఏప్రిల్ 7(ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్ తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ లోనైనా విజయం సాధించి.. ఖాతా తెరవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై టీమ్ తన గొప్ప మనసును చాటుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ లో భాగంగా ఆదివారం ప్రేక్షకులకు డబుల్ డోస్ ఉంది. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంటే.. రెండో పోరులో లక్నోను ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది గుజరాత్ టైటాన్స్. ఇక ఢిల్లీ-ముంబై మ్యాచ్ లో ఓ ప్రత్యేక ఉంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను పిల్లలకు కూడా చూపించి.. వారిని సంతోషపెట్టాలని భావించింది ఎంఐ యాజమాన్యం. అందులో భాగంగా ఆ రోజును ESA(అందరికి విద్య మరియు క్రీడలు) దినోత్సవంగా జరుపుకుంటామని ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 5(శుక్రవారం) ప్రకటించింది.

ముంబై నగరంలోని NGOల నుంచి 20 వేల మంది పిల్లలను తీసుకొచ్చి స్టేడియంలో ఫ్రీగా మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. ముంబై ఇండియన్స్ 2010 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనకబడిన పిల్లలకు క్రీడలు, విద్య రంగాల్లో సపోర్ట్ చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది. అప్పటి నుంచి ఐపీఎల్ ప్రతీ సీజన్ లో ముంబై హోం గ్రౌండ్ లో ఒక మ్యాచ్ కు పిల్లలను తీసుకొస్తూ.. ESAను జరుపుకొంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇది తెలిసిన నెటిజన్లు ఎంఐ మేనేజ్ మెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ముంబై ఇండియన్స్ కొనసాగిస్తున్న ఈ గొప్ప సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: DC vs MI: ఢిల్లీకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం! సంతోషం అంటున్న ఫ్యాన్స్, కారణం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి