అతడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్. కేవలం 44 టెస్టుల్లోనే 208 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. కానీ అనూహ్యంగా అతడికి షేన్ వార్న్ నుంచి పోటీ ఎదురైంది. దీంతో అతడి నుంచి పోటీని తట్టుకోలేకపోయిన మెక్ గిల్ ఆటకు దూరం అయ్యాడు. స్టార్ స్పిన్నర్ గా వెలుగొందుతున్న కాలంలోనే వార్న్ ఇతడి అవకాశాలను దెబ్బతీశాడు. ప్రస్తుతం స్టువర్ట్ మెక్ గిల్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు. దానికి కారణం అతడు డ్రగ్స్ సరఫరా ఆరోపణలు ఎదుర్కోవడమే. ఈ ఆరోపణలకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో ఇర్కుక్కున్న అతడు సినిమా స్టైల్లో కథను అల్లాడు. కానీ చివరికి క్లైమాక్స్ లో పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ కు అరెస్ట్ కాక తప్పలేదు.
స్టువర్ట్ మెక్ గిల్.. వార్న్ కంటే ముందే తన లెగ్ స్పిన్ తో స్టార్ బౌలర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ వార్న్ నుంచి పోటీ తీవ్రమవడంతో.. మెక్ గిల్ పోటీ తట్టుకోలేకపోయాడు. దీంతో అతడికి అవకాశాలు తక్కువైయ్యాయి. ఆసీస్ తరపున 44 టెస్టులు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ 208 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఇతడిపై డ్రగ్స్ కేసు నమోదు అయ్యింది. అసలు విషయం ఏంటంటే? 2021లో ఏప్రిల్ లో కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి.. తీవ్రంగా కొట్టారని మెక్ గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చి.. కటకటాలపాలైయ్యాడు ఫిర్యాదు ఇచ్చిన మెక్ గిల్. ఈ కిడ్నాప్ కేసులో ఆరుగురు నిందితులను విచారించగా.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలో మెక్ గిల్ కూడా సభ్యుడన్న అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా సభ్యుల మధ్యలో తెలెత్తిన విభేదాల కారణంగానే కిడ్నాప్ కు యత్నించారని విచారణలో తేలింది. దీంతో మెక్ గిల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతం అతడికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. సినిమా స్టైల్లో కిడ్నాప్ కథ అల్లి తప్పించుకుందామని చూసిన మెక్ గిల్ కు పోలీసులు షాకిచ్చారు.