iDreamPost

ఇండియాను చూసి నేర్చుకోండి, మీరింకా పాతకాలంలోనే ఉన్నారు! పాక్ టీమ్ పై అఫ్రిది ఫైర్

  • Author Soma Sekhar Published - 06:18 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Published - 06:18 PM, Sat - 16 September 23
ఇండియాను చూసి నేర్చుకోండి, మీరింకా పాతకాలంలోనే ఉన్నారు! పాక్ టీమ్ పై అఫ్రిది ఫైర్

ఆసియా కప్ లో సూపర్-4 దశలోనే పాకిస్థాన్ ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. సూపర్-4లో కీలకమైన పోరులో పాకిస్థాన్ ను ఓడించి ఫైనల్ కు వెళ్లింది శ్రీలంక. ఇక పాక్ జట్టు లంకపై ఓడిపోవడంతో.. ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పాక్ టీమ్ పై, మేనేజ్ మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరింకా పాతకాలంనాటి ఆలోచనాధోరణితోనే వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాడు. టీమిండియాను చూసైనా బుద్ది తెచ్చుకోండంటూ ఉచిత సలహాకూడా ఇచ్చాడు అఫ్రిది.

వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ గెలిచి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూసిన పాకిస్థాన్ కు బ్రేకులు వేసింది శ్రీలంక. గ్రూప్-4 దశలో జరిగిన కీలక మ్యాచ్ లో పాక్ పై లంక థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఇక ఈ విక్టరీతో లంక ఫైనల్ కు పోగా.. పాక్ ఇంటికి పోయింది. దీంతో పాకిస్థాన్ టీమ్ పై, మేనేజ్ మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. పాక్ టీమ్ ఇంకా పాతకాలం నాటి ఐడియాలనే ఫాలో అవుతుండటంపై విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు ఎంపిక నాసిరకంగా ఉందని మండిపడ్డాడు.

ఈ క్రమంలోనే రిజర్వ్ బెంచ్ పై ఉత్తమ ఆటగాళ్లను కూర్చోబెట్టి.. విఫలమైన ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారని ఎద్దేవ చేశాడు. మీరింకా పాతకాలం నాటి ఆలోచనలతోనే ముందుకు వెళ్తున్నారని, ఇండియాను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని అఫ్రిది సూచించాడు. ఈ ఆసియా కప్ లో టీమిండియా చేస్తోన్న ప్రయోగాలు ఒకసారి పరిశీలిస్తే.. వారేం చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇండియా జట్టులో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ.. తమ రిజర్వ్ బెంచ్ ను పరీక్షించుకుంది. సీనియర్లకు కొన్ని మ్యాచ్ ల్లో విశ్రాంతినిస్తూ.. యంగ్ ప్లేయర్లను ఆడించింది.

అయితే టీమిండియా ఇదంతా వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే చేసిందని అఫ్రిది పేర్కొన్నాడు. కానీ పాక్ మాత్రం అలా చేయడం లేదని ఫైర్ అయ్యాడు. మీరు షాదాబ్ ఖాన్ కు విశ్రాంతిని ఇవ్వదలచుకుంటే.. అతడి స్థానంలో ఒసామా మీర్ ని తీసుకోవాలి. వరుసగా విఫలమైన వారికి విశ్రాంతి ఇచ్చి.. కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తే.. వారి సత్తా ఏంటో కూడా తెలుస్తుందని అఫ్రిది తెలిపాడు. పాక్ మేనేజ్ మెంట్ ప్రణాళికలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదని అఫ్రిది చెప్పుకొచ్చాడు. మరి పాక్ జట్టుపై అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి