iDreamPost
android-app
ios-app

వీడియో: ఒక్క బాల్‌ కోసం పరిగెత్తిన ఐదుగురు ఫీల్డర్లు! అయినా కూడా..

  • Published Apr 01, 2024 | 5:52 PM Updated Updated Apr 01, 2024 | 5:52 PM

Bangladesh vs Sri Lanka: సాధారణంగా క్రికెట్‌లో బౌండరీ లైన్‌కు వెళ్తున్న బాల్‌ను ఆపేందుకు ఒక్కరు లేదా ఇద్దరు ఫీల్డర్లు పరిగెత్తడం చూసి ఉంటారు. కానీ, ఏకంగా ఐదుగురు ఫీల్డర్ల పరిగెత్తడం చూశారా? అలాంటి అరుదైన ఫన్నీ సీన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Bangladesh vs Sri Lanka: సాధారణంగా క్రికెట్‌లో బౌండరీ లైన్‌కు వెళ్తున్న బాల్‌ను ఆపేందుకు ఒక్కరు లేదా ఇద్దరు ఫీల్డర్లు పరిగెత్తడం చూసి ఉంటారు. కానీ, ఏకంగా ఐదుగురు ఫీల్డర్ల పరిగెత్తడం చూశారా? అలాంటి అరుదైన ఫన్నీ సీన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Apr 01, 2024 | 5:52 PMUpdated Apr 01, 2024 | 5:52 PM
వీడియో: ఒక్క బాల్‌ కోసం పరిగెత్తిన ఐదుగురు ఫీల్డర్లు! అయినా కూడా..

క్రికెట్‌లో ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయో.. అంతకు మించి ఫన్నీ సంఘటనలను కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. నిజానికి క్రికెట్‌లో మోస్ట్‌ ఫన్సీ మూమెంట్స్‌.. అంటే ఫీల్డింగ్‌లో చేసే పొరపాట్లతో నవ్వులపాలయ్యే టీమ్‌ ఏదంటే.. చాలా మంది పాకిస్థాన్‌ అంటారు. అలాగే వాళ్ల సోదరుల టీమ్‌ బంగ్లాదేశ్‌ కూడా ఈ మధ్య పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది. క్లియర్‌గా బ్యాట్‌కి తగిలిన బంతులకు డీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో నవ్వుల పాలైన బంగ్లాదేశ్‌ టీమ్‌.. తాజాగా మరో ఫీల్డింగ్‌ విన్యాసంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నా కూడా.. బంగ్లాదేశ్‌ క్రికెటర్‌.. ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు అటెన్షన్‌ను క్యాచ్‌ చేస్తున్నారంటే వారి ఫీల్డింగ్‌ విన్యాసాలు ఏం విధంగా ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు.

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఫుల్‌ కామెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లంక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో బంగ్లా బౌలర్‌ హసన్‌ మహముద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 21వ రెండో బంతిని అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ప్రభాత్‌ జయసూర్య గల్లీలోకి ఆడాడు. అయితే.. ఆ బాల్‌ను పట్టుకోవడానికి బంగ్లాదేశ్‌ టీమ్‌లోని సగం మంది ప్లేయర్లు దాని వెనుకపడ్డారు. మొత్తంగా ఐదుగురు ఆటగాళ్లు ఆ బాల్‌ను బౌండరీ వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించారు. ‘అంత మంది ఎందుకురా బాబ్జీ’ అనే డైలాగ్‌ గుర్తుకు తెచ్చేలా.. ఒక బాల్‌ వెనుక ఐదుగురు ఫీల్డర్లు పరిగెడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అంత దూరం, అంత మంది పరిగెత్తి కూడా ఆ బాల్‌కు రెండు రన్స్‌ ఇచ్చారు. మొత్తానికి బౌండరీ వెళ్లకుండా ఆపినా కూడా.. అంత మంది ఎందుకు పరిగెత్తారో అర్థం కాలేదంటూ క్రికెట్‌ అభిమానులు నవ్వుకుంటున్నారు. అయినా ఇలాంటి విచిత్రాలు చేయడం మీకే సాధ్యం అవుతుందని అంటున్నారు. ఇదే మ్యాచ్‌లో స్లిప్‌లో ఉన్న ఓ ముగ్గురు ఫీల్డర్లు కలిసి ఓ క్యాచ్‌ పట్టేందుకు నానా తిప్పలు పడ్డారు. కానీ, చివరికి ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయారు. ఇలా వరుస ఘటనలతో బంగ్లాదేశ్‌ టీమ్‌ నవ్వులపాలు అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 531 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 178 పరుగులకే ఆలౌట్‌ అయింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంకను బంగ్లాదేశ్‌ బౌలర్లు కాస్త కంట్రోల్‌ చేసినట్లు కనిపిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేయడంతో.. ప్రస్తుతం 455 పరుగుల లీడ్‌లో లంక ఉంది. మరి ఈ ‍మ్యాచ్‌లో చోటు చేసుకుంటున్న ఫన్నీ సంఘటనలతో పాటు ఒక్క బాల్‌ను ఆపేందుకు ఐదుగురు ఫీల్డర్లు వెంటపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.