iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇండియన్‌ క్రికెట్‌కి అవమానం! టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలా..

  • Published Jan 29, 2024 | 6:03 PM Updated Updated Jan 29, 2024 | 6:03 PM

India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోరంగా ఓడింది. చాలా సులువుగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా.. ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమితో భారత జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోరంగా ఓడింది. చాలా సులువుగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా.. ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమితో భారత జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 29, 2024 | 6:03 PMUpdated Jan 29, 2024 | 6:03 PM
IND vs ENG: ఇండియన్‌ క్రికెట్‌కి అవమానం! టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలా..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. తొలి రోజు నుంచి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందని ఏ ఒక్క భారత క్రికెట్‌ అభిమాని కూడా అనుకోని ఉండడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ని 246 పరుగులకే కుప్పకూల్చి.. తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి.. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ తీసుకున్న తర్వాత కూడా టీమిండియా ఓడిపోవడం సగటు క్రికెట్‌ అభిమానిని షాక్‌కు గురిచేసింది. ఈ ఓటమితో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఈ ఓటమితో టీమిండియా ఖాతాలో ఒక చెత్త రికార్డు వచ్చి చేరింది. అది కూడా భారత క్రికెట్‌ చరిత్రలో ఇంత చెత్త ఓటమి ఎదురుకాలేదు. ఈ ఓటమికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ లేదంటే ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం. అదెలాగంటే.. ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో వందకు పైగా పరుగుల ఆధిక్యం లభించిన తర్వాత ఇండియా ఎప్పుడూ మ్యాచ్‌ ఓడిపోలేదు. తొలి సారి వందకు పైగా పరుగుల లీడ్‌ లభించినా భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌పై టీమిండియాకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ లభించింది. అయినా కూడా రోహిత్‌ సేన రెండో ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో ఓటమి పాలైంది. ఇన్నేళ్ల భారత క్రికెట్‌ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 100 ప్లస్‌ రన్స్‌ లీడ్‌ దొరికిన తర్వాత ఓడిపోవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ కావడం గమనార్హం.

ఇప్పటి వరకు టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో 106 టెస్టుల్లో వందకు పైగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. వాటిలో 70 మ్యాచ్‌ల్లో ఇండియా గెలిచింది. అలాగే 35 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కానీ, తొలి సారి హైదరాబాద్‌ వేదికగా జరిగిన టెస్టులో వందకు పైగా ఆధిక్యం దక్కినా.. భారత జట్టు ఓటమి పాలైంది. ఇది భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డుగా నిలిచిపోనుంది. కాగా.. తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా ఓడిపోయిందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ దారుణంగా విఫలం అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే మొత్తం బ్యాటింగ్‌ లైనప్‌ చేతులెత్తేసింది. మరి భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలి సారి ఎదురైన ఈ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.