టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారీ స్కామ్‌! విచారణకు ఆదేశించిన ICC

T20 World Cup 2024, Scam, ICC: అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారీ స్కామ్‌ జరిగిందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఐసీసీ విచారణ కూడా ఆదేశించి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

T20 World Cup 2024, Scam, ICC: అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారీ స్కామ్‌ జరిగిందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఐసీసీ విచారణ కూడా ఆదేశించి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

దాదాపు 17 ఏళ్ల తర్వాత.. టీమిండియా రెండో సారి టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు అద్బుత ప్రదర్శనతో అదరగొడుతూ.. ఓటమి ఎరుగని జట్టుగా కప్పు కొట్టింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎంతో అద్భుతంగా పోరాడి.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచి మరీ.. టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ నిర్వహణలో భారీ ఫ్రాడ్‌ జరిగినట్లు ఐసీసీ గుర్తించింది.

తొలిసారి అమెరికా టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఈ మెగా టోర్నీ కోసం ఏకంగా కొత్త క్రికెట్‌ స్టేడియాన్నే నిర్మించింది. అమెరికాతో పాటు వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీని నిర్వహించింది. అయితే.. ఈ టోర్నీలో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు.. అందుకే ఐసీసీకి 165 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత.. ఐసీసీకి భారీ నష్టం వచ్చిందని.. అమెరికా లాంటి క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేని దేశంలో ఈ టోర్నీ నిర్వహించడంతోనే ఈ నష్టం వచ్చినట్లు తొలుత ఐసీసీ భావించింది.

టిక్కెట్ల అమ్మకాలు పెద్దగా లేకపోవడం, ప్రకటనలు కూడా రాకపోవడంతో పాటు.. టోర్నీ నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతోనే ఇన్ని కోట్ల లాస్‌ వచ్చినట్లు ఐసీసీ పెద్దలు భావించారు. అయితే.. ఇది నష్టం కాదని, ఒక స్కామ్‌ అనే అనుమానాలు తలెత్తడంతో ఐసీసీ దీనిపై ఒక కమిటీ వేసింది. రోజర్ ట్వోస్, లాసన్ నేడూ, ఇమ్రాన్‌ ఖవాజాతో కూడిన ఒక కమిటీని నియమించి.. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు కావాల్సినంత స్వేచ్ఛ కూడా కల్పించింది. అయితే.. నిధుల దుర్వినియోగం, స్కామ్‌ జరిగిన అంశంపై కమిటీ వేయడంతో.. ఐసీసీలోని ఇద్దరు హైయ్యర్‌ అఫీషియల్స్‌ రాజీనామా చేశారు. అయితే.. వారి రాజీనామాను ఇంకా ఐసీసీ ఆమోదించలేదు. ఈ స్కామ్‌లో వారి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో.. ఈ అంశంపై కూడా చర్చించారు. దీనిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించాలని నిర్ణయించారు. ఒక వేళ స్కామ్‌ జరిగిందని తేలితే.. ఐసీసీ చైర్మన్‌, సీఈఓలు సైతం రాజీనామా చేయాల్సి ఉంటుందని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments