Nidhan
Virat Kohli, T Dileep, Team India: గత కొన్నేళ్లుగా టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు టి దిలీప్. తెలంగాణకు చెందిన ఆయన వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెన్ ఇన్ బ్లూ ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడానికి అనుక్షణం కష్టపడుతూ వచ్చాడు.
Virat Kohli, T Dileep, Team India: గత కొన్నేళ్లుగా టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు టి దిలీప్. తెలంగాణకు చెందిన ఆయన వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెన్ ఇన్ బ్లూ ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడానికి అనుక్షణం కష్టపడుతూ వచ్చాడు.
Nidhan
క్రికెట్ టీమ్ గేమ్ అనే విషయం తెలిసిందే. ఏ ఒక్కరో బాగా ఆడితే మ్యాచ్‌లు గెలవలేరు. జట్టులోని ఆటగాళ్లంతా రాణించాలి. అదే టైమ్‌లో వాళ్లలోని ప్రతిభను సానబెట్టి, టీమ్ అవసరాలకు తగ్గట్లుగా తయారు చేసే కోచింగ్ సిబ్బంది కూడా ఉండాలి. ఇవన్నీ చక్కగా కుదిరాయి కాబట్టే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో జట్టు విజయం కోసం కృషి చేసిన వారిలో టి దిలీప్ ఒకడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడీ తెలుగు బిడ్డ. వన్డే వరల్డ్ కప్-2023తో పాటు పొట్టి ప్రపంచ కప్‌లోనూ జట్టుకు సేవలు అందించాడు. మన ఆటగాళ్లు ఈ లెవల్లో ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నారంటే దానికి దిలీపే కారణం. అలాంటోడు తాజాగా భారత జట్టు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్‌లోని ఓ స్టార్‌కు కోచింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదన్నాడు.
విరాట్ కోహ్లీకి కోచింగ్ ఇవ్వడం మాత్రం చాలా కష్టమని టి దిలీప్ అన్నాడు. అతడు ప్రాక్టీస్ సెషన్లో ఉంటే అందరూ భయపడాల్సిందేనని చెప్పాడు. కోహ్లీకి కోచింగ్ ఇవ్వడం బిగ్ ఛాలెంజ్ అని తెలిపాడు. ఫీల్డ్‌లో అతడు చూపించే ఇంటెన్సిటీ, ఎనర్జీ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని మెచ్చుకున్నాడు దిలీప్. విరాట్ గ్రౌండ్లో దిగాడంటే కోచ్‌లు అందరూ అలర్ట్ అవుతారని, ప్రాక్టీస్ సెషన్లో తమ బెస్ట్ ఇవ్వాల్సిందేనని తెలిపాడు. ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్ అయినా, మ్యాచ్ అయినా కోహ్లీ ఒకేరీతిలో ఉంటాడని, ఫీల్డ్‌లో ఒకే రకమైన ఇంటెన్సిటీని కనబరుస్తాడని ప్రశంసించాడు దిలీప్. అతడికి కోచింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదని.. తమకు అతడు సవాళ్లు విసురుతుంటాడని చెప్పుకొచ్చాడు.
టీమ్‌లోకి కొత్తగా వచ్చే జూనియర్లకు కోహ్లీనే స్ఫూర్తి అని దిలీప్ అన్నాడు. అతడి ప్రాక్టీస్, ఫీల్డింగ్‌ను చూసి యంగ్‌స్టర్స్ నేర్చుకుంటారని చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మీద కూడా దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని.. ఆటగాళ్లతోనే గాక కోచ్‌లతోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని పేర్కొన్నాడు. రోహిత్ వ్యక్తిత్వానికి తాను ఫిదా అయ్యానని.. హిట్‌మ్యాన్ లాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు చాలా తక్కువగా ఉంటారని వ్యాఖ్యానించాడు దిలీప్. ఫీల్డింగ్ కోచ్‌గా సక్సెస్ అవ్వాలంటే నాలెడ్జ్ ఒక్కటే సరిపోదని.. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ముఖ్యమన్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు ఇచ్చిన కోచింగ్ తనకు ఎంతో హెల్ప్ అయిందని, అక్కడ పని చేస్తూ నేర్చుకున్న విషయాలు తనను ఎంతో మెరుగుపర్చాయని తెలిపాడు.