iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఫీల్డింగ్ కోచ్! అతడిలో సగం చేసినా చాలంటూ..!

  • Published Jan 19, 2024 | 8:46 AM Updated Updated Jan 19, 2024 | 8:46 AM

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ కింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు అతడిలో సగం ఫీల్డింగ్ చేసినా.. జట్టులో అద్బుతాలు నెలకొంటాయని కితాబిచ్చాడు.

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ కింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు అతడిలో సగం ఫీల్డింగ్ చేసినా.. జట్టులో అద్బుతాలు నెలకొంటాయని కితాబిచ్చాడు.

Virat Kohli: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఫీల్డింగ్ కోచ్! అతడిలో సగం చేసినా చాలంటూ..!

ప్రస్తుతం టీమిండియా ఫుల్ స్వింగ్ లో ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని, టెస్ట్ సిరీస్ ను డ్రాగా ముగించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే జోరును పసికూన ఆఫ్గానిస్తాన్ పై కూడా చూపింది భారత్. ఆఫ్గాన్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి మ్యాచ్ లో సిక్స్ వెళ్లకుండా అద్భుతమైన ఫీల్డింగ్ తో కింగ్ కోహ్లీ మ్యాచ్ ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ.. ఫీల్డింగ్ కోచ్ డ్రస్సింగ్ రూమ్ లో ఓ స్పీచ్ ఇచ్చాడు.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియాను గెలిపించింది ఎవరు? అంటే అందరూ రోహిత్ శర్మ అంటారు. కానీ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ను గెలిపించాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే సిక్సర్ వెళ్లే బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి గ్రౌండ్ లోకి విసిరిన తీరు అద్భుతమనే చెప్పాలి. దీంతో మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ అవార్డును కోహ్లీకి ప్రకటించారు. 2023 ప్రపంచ కప్ నుంచి ఈ సంప్రదాయం వస్తున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూమ్ లో బెస్ట్ ఫీల్డర్ కు మెడల్ ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కోహ్లీకి మెడల్ అందించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ విరాట్ పై ప్రశంసలు కురిపించాడు.

Fielding coach who praised Kohli!

ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ..”జట్టు కోసం శ్రమించాలనే తపన కోహ్లీ సొంతం. అయితే తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోడు కోహ్లీ. ఇతర ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతు ముందుకుసాగుతుంటాడు. ఇక టీమ్ లోకి వచ్చే యంగ్ స్టర్స్ కోహ్లీని అనుసరిస్తూ.. అతడిలో సగం ఫీల్డింగ్ చేసినా టీమ్ అద్భుతంగా తయ్యరు అవుతుంది. గతంలో అతడు నాతో ఒకసారి మాట్లాడుతూ.. నాకు స్లిప్ లో ఉండటం ఇష్టం లేదు. నన్ను కష్టమైన స్థానాల్లో నిలపండి అని చెప్పాడు, ఇది విరాట్ లో ఉన్న గొప్ప లక్షణం” అంటూ విరాట్ పై ప్రశంసలు కురిపించాడు దిలీప్. ప్రస్తుతం ఈ స్పీచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి విరాట్ లో సగం ఫీల్డింగ్ చేసినా.. జట్టులో అద్భుతాలు జరుగుతాయి అన్న కోచ్ దిలీప్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.