iDreamPost
android-app
ios-app

కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో!

  • Published Jun 16, 2024 | 6:20 PMUpdated Jun 16, 2024 | 6:22 PM

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు మంచి ఫామ్​లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్​లో అతడు బౌలింగ్​లో చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు మంచి ఫామ్​లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్​లో అతడు బౌలింగ్​లో చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

  • Published Jun 16, 2024 | 6:20 PMUpdated Jun 16, 2024 | 6:22 PM
కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో!

పిల్లల గెలుపును తన గెలుపని అనుకుంటాడు. వాళ్ల సక్సెస్​లో సంతోషాన్ని వెతుక్కుంటాడు. జీవిత ప్రయాణంలో తాను ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. తన కంటే తన పిల్లలు లైఫ్​లో ఇంకో అడుగు పైనే ఉండాలని ఆశిస్తాడు. ఒంట్లో ప్రాణం ఉన్నన్ని రోజులు వాళ్లకు అండగా నిలుస్తాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు.. అతడే నాన్న. తండ్రి ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. అందుకే ఎప్పటికీ మన చేతిని విడవని నాన్న కోసం ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడో ఆదివారం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేను నిర్వహిస్తుంటారు. తల్లులకు మదర్స్ డేలాగే.. తండ్రి గొప్పతనాన్ని తలచుకునేందుకు ఫాదర్స్ డే నిర్వహిస్తుంటారు.

ఇవాళ నాన్నల దినోత్సవం కావడంతో సాధారణ ప్రజానీకంతో పాటు సెలెబ్రిటీలు కూడా నెట్టింట ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కొందరు సెలెబ్రిటీలు తమ పిల్లలతో ఉన్న రిలేషన్​షిప్​ గురించి చెబుతూ పోస్టులు పెడుతున్నారు. టీమిండియా స్టార్ ఆల్​రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన కుమారుడు అగస్త్యతో స్పెషల్ మూమెంట్స్​ను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు పాండ్యా. కొడుకుతో కలసి ఆడుకోవడం, ముచ్చటించడం, నవ్వుకోవడం.. అతడికి మాటలు నేర్పించడం ఇలా ఎన్నో మూమెంట్స్​ను ఈ ప్రత్యేక వీడియోలో మనం చూడొచ్చు.

తండ్రి కంటే కూడా స్మార్ట్​గా ఉన్న అగస్త్య ఆ వీడియోలో పాండ్యాను డామినేట్ చేశాడు. అతడి క్యూట్ లుక్స్, స్మైల్ బాగున్నాయి. హార్దిక్ ఫాదర్స్ డే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. పాండ్యా-అగస్త్య బాండింగ్ సూపర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, కెరీర్ విషయానికొస్తే.. ఈ డాషింగ్ ఆల్​రౌండర్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్​తో బిజీగా ఉన్నాడు. గాయం కారణంగా కొన్నాళ్లు క్రికెట్​కు దూరమైన అతడు.. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే క్యాష్ రిచ్ లీగ్​లో అతడు బౌలింగ్, బ్యాటింగ్​తో పాటు కెప్టెన్సీలో విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు పెరిగాయి. కానీ పొట్టి కప్పులో అదరగొట్టి తానేంటో మరోమారు ప్రూవ్ చేశాడు. వరల్డ్ కప్​లో 7 వికెట్లు పడగొట్టిన పాండ్యా.. పాకిస్థాన్​తో మ్యాచ్​లో 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు. సూపర్-8, సెమీస్​లోనూ టీమిండియాకు అతడు కీలకం కానున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి