iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్-కోహ్లీ తీరు మారిందా? ఇద్దరి మధ్య మళ్లీ బలమైన స్నేహం?

  • Published Jan 10, 2024 | 5:56 PM Updated Updated Jan 10, 2024 | 5:56 PM

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ తీరు ప్రస్తుతం మారిందని, వారిద్దరి మధ్య మళ్లీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ తీరు ప్రస్తుతం మారిందని, వారిద్దరి మధ్య మళ్లీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit-Kohli: రోహిత్-కోహ్లీ తీరు మారిందా? ఇద్దరి మధ్య మళ్లీ బలమైన స్నేహం?

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. క్రికెట్ అనే కురుక్షేత్ర యుద్దంలో తన నాయకత్వ పటిమతో జట్టును శ్రీకృష్ణుడి వలే ముందుకు నడుపుతున్నాడు రోహిత్. ఇక అర్జునుడి పాత్రను దిగ్విజయంగా పోషిస్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. వీరిద్దరు కలిసి భారత జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నారు. అయితే గతంలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీని ఆ పదవి నుంచి తొలగించి, పగ్గాలను రోహిత్ కు అందించింది యాజమాన్యం. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే దూరంగా ఉంటున్నారని వార్తలు కోడైకూశాయి. ఇక ఈ వార్తలకు చెక్ పెడుతూ.. ఇటీవలే విరాట్ కోహ్లీ తనకూ రోహిత్ కు మధ్య ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము శత్రువులం కాదని, మంచి మిత్రులమని తేల్చి చెప్పాడు. అదీకాక సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో విరాట్-రోహిత్ మధ్య ఓ అద్భుతమై దృశ్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరి మధ్య బలమైన స్నేహం అల్లుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాలో జోడు గుర్రాల పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించారు. కానీ అనూహ్యంగా కెప్టెన్సీ తెచ్చిన కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. కోహ్లీ నుంచి సారథ్య పగ్గాలు రోహిత్ కు అప్పగించడం ఇండియన్ క్రికెట్ లో సంచలనం సృష్టించింది. దీంతో రోహిత్-కోహ్లీ మధ్య దూరం పెరిగిందని చాలా వార్తలు వచ్చాయి. వీటితో పాటుగా కొన్ని మ్యాచ్ లు రోహిత్ ఆడితే.. మరికొన్ని మ్యాచ్ లకు విరాట్ దూరంగా ఉండేవాడు. దీంతో వీరిద్దరూ రెండు సంవత్సరాల క్రితం కలిసి ఆడింది తక్కువ మ్యాచ్ లే. పైగా 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీరు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఆ న్యూస్ పై ఇద్దరూ పెద్దగా స్పందించింది లేదు. దీంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని కొందరు డైరెక్ట్ గానే చెప్పుకొచ్చారు.

best friends again

కాగా.. ఇటీవల రోహిత్ తో ఫ్రెండ్షిప్ పై విరాట్ కోహ్లీ స్పందించాడు. రోహిత్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటామని పేర్కొన్నాడు. ఇక తన సలహాలు నేను, నా సలహాలు తను పాటిస్తాడని కోహ్లీ తెలిపాడు. దీంతో రోహిత్-కోహ్లీల మధ్య ఏం లేదని స్పష్టమైంది. ఈ క్రమంలోనే తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో విరాట్-రోహిత్ కౌగిలించుకోవడం ఫ్యాన్స్ కు ఎక్కడాలేని సంతోషాన్ని ఇచ్చింది. మీ ఇద్దరిని ఇలా చూసి ఎన్ని రోజులైంది.. ఇది కదా మీ నుంచి మేం కోరుకునేది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. రోహిత్-కోహ్లీ తీరు మారిందని, ప్రస్తుతం వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో రోహిత్-కోహ్లీలు మునుపటిలా కనిపించారు. బెస్ట్ ఫ్రెండ్స్ గా మారడంతో.. టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి విరాట్-రోహిత్ లు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.