ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సమరం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమరంలో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈ సిరీస్ వివాదాలకు, గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇప్పటికే గ్రీన్, స్మిత్ క్యాచ్ లు వివాదానికి దారితీయగా.. బెయిర్ స్టో ఔట్ యాషెస్ లో పెద్ద దుమారాన్నే లేపింది. తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి గొడవ గ్రౌండ్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాడు. క్రిస్ బ్రాడ్ పై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ తొలి ఇన్నింగ్స్ లో, రెండో ఇన్నింగ్స్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దాంతో బ్రాడ్ తండ్రి అయిన క్రిస్ బ్రాడ్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అతడి బౌలింగ్ లో అవుట్ అయితే.. వాళ్ల నాన్నపై కోప్పడటం ఏంటని మీకు అనుమానం వచ్చిందా? అసలు విషయంలోకి వస్తే.. ఈ మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ అయిన వార్నర్, కెరీర్ లో 17వ సారి అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో వార్నర్ ను ట్రోల్ చేస్తూ.. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ తో రెచ్చిపోయారు.
ఇందులో భాగంగా.. బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఆ ట్వీట్ ను రీషేర్ చేశాడు. ఇదే క్రికెట్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు.. క్రిస్ బ్రాడ్ పై మండిపడుతున్నారు. కొడుకు టాలెంట్ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ రిఫరీ అయి ఉండి.. ఇంతలా దిగజారిపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అదీకాక 2007 టీ20 ప్రపంచ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో.. ఆరు సిక్సర్లు కొట్టిన విషయం మర్చిపోయావా? అప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు చేయలేదు? అంటూ బ్రాడ్ తండ్రిపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
What a start! 🤩
Broad gets Warner for the…
*Checks notes*
…Sixteenth time! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/WfSoa5XY1G
— England Cricket (@englandcricket) July 6, 2023
— Chris Broad (@ChrisBroad3) July 7, 2023