ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ వేచి చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తమ టాలెంట్ ను చూపిస్తాం.. చోటు కొట్టేస్తాం అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మరికొంత మంది ఆటగాళ్లు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాగానీ వాటిని సద్వినియోగ పరుచుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. పృథ్వీ షా సైతం ఇలాగే తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోతున్నాడు. సంజూ శాంసన్ కోసం ఫ్యాన్స్ బీసీసీఐపై విమర్శలు, ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి వెస్టిండీస్ తో సిరీస్ లో అవకాశం కల్పించింది సెలక్షన్ కమిటీ. కానీ దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు ఈ యంగ్ ప్లేయర్.
సంజూ శాంసన్.. జట్టులో చోటు లేకపోయినా.. అతడి పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. జట్టులో ప్లేస్ లేకపోతే.. అవకాశం ఇవ్వండి అంటూ సంజూ ఫ్యాన్స్ బీసీసీఐను ఏకిపారేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సంజూకు రాకరాక వెస్టిండీస్ పర్యటనలో అవకాశం వచ్చింది. కానీ ఈ సిరీస్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే.. మరో మ్యాచ్ లో ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నాడు.
తాజాగా విండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు సంజూ. తొలి టీ20లో 12 పరుగులు చేసిన ఇతడు, రెండో మ్యాచ్ లో 7 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో శాంసన్ పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియాలో చోటు కోసం ఎంతో మంది యువ ఆటగాళ్లు పోటీ పడుతున్న నేపథ్యంలో శాంసన్ ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడంతో నెట్టింట విమర్శలు చేస్తున్నారు. శాంసన్ ఇదే ఆటతీరును కనబరిస్తే.. జట్టులో చోటు కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆసియాకప్-2023, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల ముందు శాంసన్ ఆటతీరు అతడి కెరీర్ ను డేంజర్ జోన్ లో పడేసిద్దని క్రీడా పండితులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక జట్టులో చోటు ఇవ్వమంటారు.. ఇస్తే ఇలా ఆడతాడు అంటూ మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కాగా.. ఐపీఎల్ లో 3800లకు పైగా రన్స్ చేసిన సంజూ శాంసన్.. ఇంటర్నేషనల్ టీ20ల్లో మాత్రం గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. తన కెరీర్ లో ఇప్పటివరకు 19 టీ20 మ్యాచ్ లు ఆడిన శాంసన్.. 18.62 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. అతడి గణాంకాలు చూస్తేనే తెలుస్తుంది అతడి ఆటతీరు అంటూ సర్వత్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మరి సంజూ శాంసన్ ఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా కివీస్ లెజెండ్! కావ్య పాప మాస్టర్ ప్లాన్..